తన రీమేక్ సినిమాలో నటించిన చిరుపై షాకింగ్ కామెంట్ చేసిన మోహన్ లాల్!

మోహన్ లాల్ మలయాళ ప్రముఖ సినీ నటుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన దర్శకుడిగా.. నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేయడం జరిగింది. దాదాపుగా నాలుగు దశాబ్దాల నుండి మలయాళ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఏకంగా 400 చిత్రాలలో నటించడం జరిగింది. అప్పుడప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో నటించడం జరిగింది.

1978 సంవత్సరంలో తిరనొట్టం అనే మలయాళ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. కానీ ఈ చిత్రం దాదాపుగా 25 సంవత్సరాలు విడుదలకు నోచుకోలేదు. ఇక 1990లో వచ్చిన మంజిల్ విరింజ పుక్కల్ అనే మలయాళ చిత్రంలో ప్రతి నాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత వరుస సినిమాలలో నటించి గుర్తింపు పొంది హీరోగా పలు చిత్రాలలో నటించడం జరిగింది.

ఇదంతా పక్కనపడితే ఇటీవలే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా గురించి మోహన్ లాల్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం మలయాళం లో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ అని తెలిసిందే.

లూసిఫర్ మలయాళం లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. నటుడు మోహన్ లాల్ మాట్లాడుతూ చిరంజీవి తనకు మంచి స్నేహితుడని తన సినిమాను రీమేక్ చేసి నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. దర్శకుడు మోహన్ కృష్ణ ఈ సినిమాను చక్కగా తెరపైకి ఎక్కించాడని తెలిపాడు.

ఇందులో చిరంజీవితో పాటు నటించిన సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, మురళీ శర్మల నటన అద్భుతం అని పేర్కొన్నాడు. ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యి విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని.. తన సినిమా రీమేక్ లో తన మిత్రుడు చిరంజీవి నటించడం సంతోషంగా ఉందని పేర్కొనడం జరిగింది.

చిరంజీవితో స్వయంగా తన ఆనందాన్ని పంచుకున్నట్లు మోహన్ లాల్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పోతే మోహన్ లాల్ ఒక మలయాళ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు సమాచారం.