నాకు అలాంటి ఆలోచన లేదు.. కానీ చేయాలని ఉంది: షాలినీ

‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో చక్కని గుర్తింపు తెచ్చుకుంది షాలినీ పాండే. తదుపరి ‘మహానటి’లో సుశీల పాత్రతోనూ మెప్పించారు. ఆ తర్వాత 118, ఎన్టీఆర్‌ కథానాయకుడు వంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చినా ఏదీ ఆశించిన రీతిలో విజయం సాధించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు చెప్పింది.. ”మాది సినీనేపథ్యంలేని కుటుంబం. కానీ నాకు చిత్ర పరిశ్రమలోకి రావాలని ఆశ ఉండేది. అందుకే 2017లో వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’లో ప్రీతిగా నటించే అవకాశం వస్తే కాదనలేకపోయాను.

ఆ చిత్రం హిందీలోనూ మంచి విజయం సాధించింది. కబీర్‌ సింగ్‌లో కూడా విూరే నటించి ఉంటే బాగుండేది కదా? అని నన్ను అడుగుతున్నారు. కానీ నాకు ఆ ఆలోచనే రాలేదు. నేను దానిని ఓ రీమేక్‌ చిత్రంగా చూడలేదు. ఇద్దరూ కొత్త నటీనటులతో వచ్చిన చిత్రం కాబట్టి పూర్తి భిన్నమైన సినిమాగా చూశాను. షాహిద్‌ కపూర్‌, కియారా కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. భావోద్వేగాలు కూడా అలా కుదిరాయి, అయితే నేను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించా. ఒకే భాషకు పరిమితం కావాలని ఎప్పుడూ అనుకోలేదు.

మళ్లీ తెలుగు సినిమాలు చేయాలనుంది. ఎందుకంటే తెలుగు సినిమాతోనే నా కెరీర్‌ మొదలైంది. తెలుగమ్మాయిని కాకపోయినా.. నా తొలి సినిమాకు ప్రేక్షకులు అందించిన ప్రేమ ఎంతో ప్రత్యేకం’’ అని తెలిపింది షాలిని. ప్రస్తుతం ఆమె ఆమె ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు రెండు ప్రాజెక్టులతో సిద్థంగా ఉంది. బాలీవుడ్‌లో ‘మహారాజా’ చిత్రంలోనూ నటిస్తోంది.