నేను ప్రశాంతంగా ఉంటేనే పిల్లలను ప్రశాంతంగా పెంచుతాను.. పిల్లల గురించి, విడాకుల గురించి వైరల్ కామెంట్స్ చేసిన సీమాఖాన్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో విడాకులు అనేది సర్వ సాధారణం. విడాకుల లిస్టు తీస్తే అందులో బాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ చాలామంది ఉంటారు ఆ జాబితాలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దంపతులకు ఉన్నారు. సోహైల్ ఖాన్ తన భార్య సీమఖాన్ కి 2022లో విడాకులు ఇచ్చేశాడు. కాగా వీరికి నిర్వాణ, యోహాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారణాలు ఏమిటనే విషయంపై స్పష్టత లేకపోయినా చాలా సంవత్సరాలు విడివిడిగా ఉన్న ఈ జంట ఆఖరికి 2022లో విడాకుల ద్వారా విడిపోయారు.

అయితే సీమఖాన్ తాజాగా జూమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల గురించి, విడాకుల గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. భార్య భర్తలు విడిపోతే పిల్లలపై ఊహించని ప్రభావం పడుతుంది తమ తల్లిదండ్రులు విడాకులు తీసుకోవాలని ఏ పిల్లలు కోరుకోరు వాస్తవానికి పిల్లల తప్పు ఏమి ఉండదు. అయితే ప్రజలు పిల్లలను బాధితులుగా చూస్తారు. బాధాకరమైన విడాకులు ఏ పిల్లలకి మంచిది కాదు.

పిల్లలను మంచి వాతావరణంలో పెంచడం తల్లిదండ్రుల బాధ్యత అందుకు వారి మానసిక స్థితి కూడా బాగుండాలి. మన మనసు సంతోషంగా లేనప్పుడు మన పిల్లల్ని సంతోషపెట్టగలమని నేను అనుకోను నా మూడ్ బాగోకపోతే ఎప్పుడు చిరాకు పడతాను, అదే కోపం నా పిల్లలపై పరోక్షంగా వస్తుంది కానీ నా మనస్సు ప్రశాంతంగా ఉంటే వారిని కూడా సంతోషంగా ఉంచగలను. నిజానికి ఎవరైనా వైవాహిక బంధంలో సంతోషంగానే ఉండాలనుకుంటారు కానీ పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండవు కాలంతో పాటు మనిషి మారుతున్నాడు.

జీవితంలో తప్పులు జరుగుతాయి, అయితే మేము ఇప్పటికీ ఒక కుటుంబం లా కలిసే ఉన్నాము అంటూ చెప్పుకొచ్చింది సీమ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సోహైల్ ఖాన్, అతని భార్య సీమా పెళ్లయిన 24 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అది తన పిల్లలపై మరింత ప్రభావం చూపుతుందని సీమ ఆవేదన వ్యక్తం చేసింది.