నేనెప్పుడూ భిన్నమైన సినిమాలకే ప్రాధాన్యత ఇస్తా : కీర్తిసురేష్‌

”ఒక హిట్టు సినిమా పడిందనో..ఫ్లాప్‌ వచ్చిందనో అప్పటికప్పుడు స్క్రిప్ట్‌ ఎంపికలో మన ఆలోచనా విధానం మారిపోదు. ఇది నాకు ప్రయోగాలు చేసే సమయం’’ అని అంటున్నారు కీర్తిసురేష్‌. ఈ ఏడాది ‘దసరా’, ‘మామన్నన్‌’ సినిమాలతో హిట్‌ జోరు చూపించారామె.

అయితే ఈ విజయాల వల్ల కథల ఎంపికలో ఆలోచనలు మారుతుంటాయా? అని ఓ వేదిక అడిగిన ప్రశ్నకు కీర్తి సురేష్‌ సమాధానమిచ్చారు. ‘‘హిట్టు పడిందనో..ఫ్లాప్‌ వచ్చిందనో కథల ఎంపికలో మన ఆలోచనా విధానం మారిపోదు. నేనెప్పుడూ భిన్నంగా చిత్రాలు చేయాలనుకుంటా. వైవిధ్యమైన పాత్రలతో అలరించాలనుకుంటా. ఎందుకంటే నాకిది ప్రయోగాలు చేసే సమయం.

కానీ, నా దగ్గరకొస్తున్న కథలు, పాత్రలు నా ఊహలకు, కలలకు మించినవై ఉన్నప్పుడు మళ్లీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఆ ప్రయాణాన్ని ఎంత బాగా ఆస్వాదించాలన్న దానిపైనే దృష్టిపెడితే సరిపోతుంది’ అని కీర్తి సురేశ్‌ చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం సైరెన్‌, రఘు తాత, రివాల్వర్‌ రీటాలతో బిజీగా ఉంది. రాధికా ఆప్టేతో కలిసి ‘అక్క’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది.