జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆది.. అందుకే పవన్‌ను పర్సనల్‌గా కలిశారా?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న రియాల్టీ షో లలో జబర్దస్త్ కామెడీ షో అధిక రేటింగ్స్ తో నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా గుర్తింపు పొందారు. అలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. అదిరే అభి టీమ్ లో కంటెస్టెంట్ గా జబర్దస్త్ లో అడుగుపెట్టిన ఆది కొంతకాలానికే టీమ్ లీడర్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆది బుల్లితెర మీద పలు టీవి షోస్ లో సందడి చేస్తూ బుల్లితెర రారాజుగా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా తాజాగా హైపర్ ఆదికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. ఈ విషయం హైపర్ ఆది చాలా సందర్భాలలో స్వయంగా వెల్లడించాడు. హైపర్ ఆది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరహర వీరమల్లు సినిమాలో ఒక పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఆది పర్సనల్ గా పవన్ కళ్యాణ్ ని కలిశాడు. ఈ విషయం ఆది స్వయంగా వెల్లడించాడు. దీంతో ఆది పవన్ కళ్యాణ్ ని కలవటానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడ్డారు. ఆది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరహర వీరమల్లు సినిమాలో ఒక పాత్రలో నటిస్తుండటం వల్ల పవన్ కళ్యాణ్ ని కలవటానికి వెళ్ళాడు అని సమాచారం.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ..సాధారణంగా ఈ రోజుల్లో డబ్బు ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ కి డబ్బు మీద అసలు ఆశ లేదు. అలా డబ్బు పై వ్యామోహం లేని వ్యక్తులు ఎప్పుడూ ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తారు అంటూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించి సంపాదించిన డబ్బు మొత్తం చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఇస్తానని ప్రకటించాడు. అలాంటి మంచి పనిలో తాను కూడా భాగమవుతానని ఇక జనసేన పార్టీలో భాగంగా ఏదైనా ప్రచారానికి తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని ఆది పేర్కొన్నారు.ఈ క్రమంలో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా అని యాంకర్ ప్రశ్నించగా.. అలాంటి ఆశలు ఏమీ లేవని ఆది వెల్లడించాడు.