Jabardasth: హైపర్ ఆదితో కలిసి స్కిట్ చేసిన సింగర్ మనో.. ఆది పంచులు తట్టుకోలేక..?

hyper aadi skit with singer manu in jabardasth

సింగర్ మనో.. మల్టీ టాలెంటెడ్. ఆయన యాక్టింగ్ చేస్తారు.. పాటలు పాడుతారు.. డబ్బింగ్ ఆర్టిస్ట్.. టెలివిజన్ యాంకర్.. జడ్జి.. నిర్మాత.. ఇలా ఆయనలో ఎన్నో టాలెంట్లు ఉన్నాయి. తాజాగా ఆయనలో ఉన్న మరో టాలెంట్ ను బయటపెట్టారు మనో.

hyper aadi skit with singer manu in jabardasth
hyper aadi skit with singer manu in jabardasth

సాధారణంగా జబర్దస్త్ లో కంటెస్టెంట్లు స్కిట్లు చేస్తారు. జడ్జిలు ఆ స్కిట్లు బాగున్నాయో లేదో.. అని చెబుతారు. మంచి స్కిట్ కు బెస్ట్ స్కిట్ అనే అవార్డు కూడా ఇస్తారు.

అయితే.. జడ్జి సీటులో కూర్చొని 10 మార్కుల బోర్డు ఎత్తడం పెద్ద కష్టం కాదు కానీ.. స్టేజీ మీద స్కిట్ ను పండించడం మాత్రం అంత వీజీ కాదు. అది చాలా కష్టం.. అనే విషయం సింగర్ మనోకు తెలిసి వచ్చి ఉంటుంది.

ఎందుకంటే.. హైపర్ ఆదితో కలిసి స్కిట్ చేసిన మనో.. ఆది పంచులను తట్టుకోలేకపోయారు. ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఆది వేస్తున్న పంచులను అందుకొని వెంటనే కౌంటర్ ఇవ్వలేకపోయారు.

hyper aadi skit with singer manu in jabardasth
hyper aadi skit with singer manu in jabardasth

సెప్టెంబర్ నెలలో హైపర్ ఆది చేసిన స్కిట్లన్నింటినీ కలిపి ఓ వీడియోగా రూపొందించి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. అందులో ఒక స్కిట్.. సింగర్ మనోతో ఉంటుంది. ఆ స్కీట్ చూస్తే అర్థమవుతుంది.. హైపర్ ఆది పంచులు ఎలా ఉన్నాయో? సింగర్ మనో.. ఆ పంచులను ఎలా తట్టుకోలేకపోయారో?

అసలు.. ఈ హైపర్ ఆది.. ఇలా టకాటకా పంచులు ఎలా వేస్తాడు? ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. ఎదుటి వారు ఎంతటి వారు అయినా సరే.. పంచులు వేయడంలో దిట్ట అయిపోయాడు. అందుకే జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ కు అంత పాపులారిటీ.

సరే.. హైపర్ ఆది స్కిట్లు ఉన్న వీడియో చూస్తారా?

Hyper Aadi | All in One September Month Performances | Jabardasth | ETV Telugu