అక్కడ అది కూడా నేర్పించారా?.. దొరబాబును వదలని హైపర్ ఆది

Hyper Aadi Satire On Dorababu In Jabardasth

హైపర్ ఆది వేసే పంచ్‌లు, చేసే స్కిట్స్, ఆ ప్రాసలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంటాయి. చిన్న వాళ్ల దగ్గరి నుంచి పెద్ద వాళ్ల వరకు హైపర్ ఆది పంచ్‌లకు, సెటైర్లకు ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. మామూలుగా హైపర్ ఆది ప్రజెంట్ ట్రెండ్‌ మీద స్కిట్స్, పంచ్‌లు వేస్తుంటాడు. అందుకే ఎక్కువ మంది అతని స్కిట్స్‌కే ఫిదా అవుతుంటారు. అందుకు తగ్గట్టు హైపర్ ఆది ప్రాసల ప్రవాహం అదిరిపోతుంది.

Hyper Aadi Satire On Dorababu In Jabardasth
Hyper Aadi Satire On Dorababu In Jabardasth

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ హైపర్ ఆది దుమ్ములేపేశాడు. అయితే హైపర్ ఆది టీంలో ఉండే దొరబాబు, పరదేశీల గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దొరబాబు గురించి మాత్రం స్పష్టంగా తెలిసే ఉంటుంది. అప్పుడెప్పుడో బీ గ్రేడ్ సినిమాలు, వీడియోల్లో నటించడంతో దొరబాబుపై డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేసి స్కిట్స్‌ను రక్తి కట్టిస్తుంటాడు. ఆ మధ్య దొరబాబు, పరదేశీల వ్యవహారం మీడియాలో బాగా వైరల్ అయింది.

Hyper Aadi Satire On Dorababu In Jabardasth
Hyper Aadi Satire On Dorababu In Jabardasth

దొరబాబు, పరదేశీలు వైజాగ్‌లో వ్యభిచార గృహంలో పట్టుబడ్డ సంగతి తెలిసింది. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనం సృష్టించింది. ఇక మెల్లిగా ఆ వ్యవహారం సద్దుమణిగాక.. మళ్లీ యథావిథిగా జబర్దస్త్‌లో అడుగుపెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది గానీ.. హైపర్ ఆది తన ప్రతీ స్కిట్ ఆ గతాన్ని తవ్వుతూనే ఉంటాడు. వాటికి సంబంధించి ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉన్నాడు. తాజా ప్రోమోలోనూ దొరబాబును వదలిపెట్టలేదు. స్కిట్‌లో భాగంగా దొరబాబు సాంబార్ వండాడు. దాని టేస్ట్ చూడమని ఆదికి ఇస్తే.. అక్కడ (జైల్లో)ఇది కూడా నేర్పించారా? అంటూ సెటైర్ వేసేశాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు.