పాపం దొరబాబు, పరదేశీ.. జైలుకెళ్లిన విషయాన్ని మరిచిపోని హైపర్ ఆది

హైపర్ ఆది తన స్కిట్స్‌లో ఎలాంటి పంచ్‌లు వేస్తాడో అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిన కాన్సెప్ట్‌లు, పాపులర్ అయిన టాపిక్స్, జనాల నోళ్లల్లో ఉండే విషయాలను కాన్సెప్ట్‌గా ఎంచుకుంటారు. ట్రెండింగ్ టాపిక్‌ మీద సెటైర్లు వేస్తూ స్కిట్‌ను కానిచ్చేస్తాడు. మరీ ముఖ్యంగా వేరే వాళ్ల మీద సెటైర్లు వేయడం ఎందుకని అనుకుంటాడో ఏమో గానీ.. తన టీం మేట్స్ పైనే పంచ్‌లు వేస్తుంటాడు.

Hyper Aadi Satire On Dorababu And Paradesi
Hyper Aadi Satire On Dorababu And Paradesi

 

మరీ ముఖ్యంగా శాంతి స్వరూప్, రైజింగ్ రాజు, పరదేశీ, దొరబాబులను పంచ్‌లతో ఓ రేంజ్‌లో ఆడుకుంటాడు. వ్యభిచారం కేసులో పరదేశీ, దొరబాబులు పట్టుబడిన సంగతి తెలిసిందే. పట్టుబడ్డ జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు మీడియా, సోషల్ మీడియాలో ఆ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఆ దెబ్బతో దొరబాబు, పరదేశీలు విపరీతంగా ఫేమస్ అయ్యారు. అలా పట్టుబడ్డ పరదేశీ, దొరబాబులను తన స్కిట్స్‌లో ఓ రేంజ్‌లో వాడేస్తుంటాడు.

Hyper Aadi Satire On Dorababu And Paradesi
Hyper Aadi Satire On Dorababu And Paradesi

అలా పట్టుబడటం, పోలీసులు జైల్లో వేయడం గురించి ప్రతీసారి తన స్కిట్‌లో సెటైర్లు వేస్తూనే ఉంటాడు. తాజాగా కూడా అలాంటి పంచులు వేసి పరువుతీశాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కాబట్టి వాటి మీదే స్కిట్ వేశాడు. తనది హైపర్ సూపర్ కింగ్స్ అంటూ ఆది చెప్పుకొచ్చాడు. హైపర్ ఆది పీపీఎల్(పీకుతాం పొడుస్తాం లేపుతాం) టీం అన్నాడు. దొరబాబు వెంటనే అందుకుని మాది జీపీఎల్ టీం అని చెబుతూ అంటే ఏంటో తెలుసా? అన్నాడు. హా తెలుసు గోకుతారు. పట్టుబడతారు.. లోపలకి వెళ్తారు అంటూ మళ్లీ నాటి ఘటనను గుర్తు చేశాడు.