ఈఎంఐలు కట్టలేకనే ముక్కు అవినాష్ బిగ్ బాస్ కు వెళ్లాడు.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్

hyper aadi punch on bigg boss contestant mukku avinash

హైపర్ ఆది.. ఆయనకు పేరు పెట్టినట్టుగానే ఆయన కొంచెం హైపరే. ఆయన వేసే పంచులకు నవ్వలేక జడ్జిలు, రివర్స్ పంచ్ వేయలేక మిగితా కంటెస్టెంట్లు జుట్టు పీక్కోవాల్సిందే. ఆయన టాకింగ్ పవర్ అటువంటిది. ఆది స్కిట్ లో పంచులే ఎక్కువ. వరుసబెట్టి పంచులు పడుతూనే ఉంటాయి. కొన్ని రియల్ లైఫ్ సంఘటనలను తీసుకొని జబర్దస్త్ కంటెస్టెంట్లు, టీమ్ లీడర్లపై పంచులు వేస్తుంటాడు హైపర్ ఆది.

hyper aadi punch on bigg boss contestant mukku avinash
hyper aadi punch on bigg boss contestant mukku avinash

సాధారణంగా తన స్కిట్ లో ఎప్పుడూ దొరబాబును ఆడుకునే హైపర్ ఆది.. తాజాగా ప్రసారమైన స్కిట్ లో ముక్కు అవినాష్ మీద పడ్డాడు. అవినాష్ ఇటీవలే బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాడు కదా. అసలు అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ హౌస్ కు ఎందుకు వెళ్లాడో స్టేజీ మీదే చెప్పేశాడు హైపర్ ఆది.

దీంతో మిగితా కంటెస్టెంట్లతో పాటుగా.. జడ్జిలు కూడా షాకయ్యారు. అయితే.. ఒకసారి ఏదైనా షో చేస్తూ బయటికి వెళ్తే.. ఆ షోలోకి తిరిగి రావడం కష్టం. చాలామందిని అలా చూశాం. మంచి భవిష్యత్తు, కెరీర్ ఉన్న జబర్దస్త్ ప్లాట్ ఫామ్ ను ముక్కు అవినాష్ వదిలేసి వెళ్లాడంటే.. మళ్లీ తిరిగి అతడిని జబర్దస్త్ లోకి తీసుకోరు.. అనే వార్తలు వినిపిస్తున్నాయి.

hyper aadi punch on bigg boss contestant mukku avinash
hyper aadi punch on bigg boss contestant mukku avinash

అయితే.. అవినాష్ జబర్దస్త్ ను వదిలివెళ్లడానికి బలమైన కారణం ఉందట. ప్రస్తుతం అవినాష్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడట. ఈఎంఐలు కట్టలేకనే జబర్దస్త్ వదిలి అవినాష్ బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాడంటూ హైపర్ ఆది ఇన్ డైరెక్ట్ గా అవినాష్ గురించి తన స్కిట్ లోనే చెప్పేశాడు.

అయితే.. సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆది చెప్పింది నిజమేనని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. లాక్ డౌన్ కు ముందే అవినాష్ కొత్త ఇల్లు కొనుక్కున్నాడట. వెంటనే కరోనా రావడం.. లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ లు ఆగిపోయి.. ఈఎంఐలు కట్టలేకపోయాడట. అలా.. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయిపోయి.. జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాడట అవినాష్.

హైపర్ ఆది.. అవినాష్ మీద వేసిన పంచ్ కు సంబంధించిన స్కిట్ ఇదే..

Hyper Aadi & Raising Raju Performance | Jabardasth  | 24th September 2020  | ETV Telugu