జబర్దస్త్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. జబర్దస్త్ షూటింగ్ బంద్? హైపర్ ఆదికి కూడా కరోనా రావడంతో?

hyper aadi gets corona, jabardasth shooting stopped

జబర్దస్త్ టీంను కరోనా మహమ్మారి వదలడం లేదు. వరుసగా కంటెస్టెంట్లను కరోనా పీడిస్తోంది. కరోనా దృష్ట్యా ఎన్నో రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకొని షూటింగ్ చేస్తున్నా.. జబర్దస్త్ సెట్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే వరుసగా అక్కడ వ్యాప్తి చెందుతున్న కరోనా.

hyper aadi gets corona, jabardasth shooting stopped
hyper aadi gets corona, jabardasth shooting stopped

ఇప్పటికే సుడిగాలి సుధీర్ కు కరోనా సోకడంతో ఒక్కసారిగా సుధీర్ అభిమానులు విస్తుపోయారు. సుధీర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. సుధీర్ కు కరోనా రాగానే.. వెంటనే జబర్దస్త్ సెట్ లోని మిగితా వాళ్లు, ఢీ షోలోని వాళ్లు అందరూ టెస్టులు చేయించుకున్నారట.

అయితే.. తర్వాత రష్మీకి కూడా కరోనా సోకిందని తెలిసింది. రష్మీ కూడా హోం క్వారంటైన్ లో ఉంటూ… వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటోందట.

hyper aadi gets corona, jabardasth shooting stopped
hyper aadi gets corona, jabardasth shooting stopped

తాజాగా వచ్చిన న్యూస్ ఏంటంటే.. హైపర్ ఆదికి కూడా కరోనా సోకిందట. దీంతో జబర్దస్త్ షూటింగ్ కే ప్యాకప్ చెప్పారట. వరుసగా కంటెస్టెంట్లు అందరికీ కరోనా సోకుతుండటంతో తప్పని పరిస్థితుల్లో జబర్దస్త్ షూటింగ్ ను ఆపేశారట నిర్వాహకులు.

సో.. కొన్ని రోజుల పాటు జబర్దస్త్ షోను ఆపేసి.. కంటెస్టెంట్లంతా నార్మల్ అయ్యాక మళ్లీ ప్రారంభించాలని యోచిస్తున్నారట. అయితే.. ఇప్పటికే షూటింగ్ చేసిన ఎపిసోడ్లను మాత్రం ప్రసారం చేయనున్నారు. వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అయితే.. ఆ వచ్చే వారం నుంచి జబర్దస్త్ ప్రసారం కాకపోవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.