Home TV SHOWS ట్రాకు మారిందే.. రష్మీపై కన్నేసిన హైపర్ ఆది

ట్రాకు మారిందే.. రష్మీపై కన్నేసిన హైపర్ ఆది

మామూలుగా అయితే రష్మిన పొగడాలన్నా, ఫ్లర్ట్ చేయాలన్నా కూడా ఆ బాధ్యతను సుధీర్ తన భుజాన వేసుకుంటాడు. కానీ కొత్తగా ఆ పనిని హైపర్ ఆది చేప్టటాడు. రష్మీని పొగిడే పని పెట్టుకున్నాడు. ఢీ షోలో ఇదొ కొత్త రకం ట్రాక్ కావొచ్చు లేదా సపరేట్‌గా ఏదైనా టాస్క్ కావొచ్చు. కానీ సుధీర్ పక్కనే ఉండగా ఆది మాత్రం రష్మీని బుట్టలో పడేసేందుకు బాగానే ట్రై చేశాడు. కానీ అది వర్కవుట్ కానట్టు కనిపిస్తోంది.

సంక్రాంతి స్పెషల్‌గా వచ్చే వారం రాబోతోన్న ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో సంగీత స్పెషల్ గెస్ట్‌గా వచ్చింది. ఇక ఈ ఎపిసోడ్‌ను కాసింత స్పెషల్‌గానే ట్రై చేసినట్టున్నారు. అందరూ కలిసి ఆదిని బక్రాను చేసే పని పెట్టుకున్నారు. రష్మీ, దీపిక పిల్లిని పొగడాలంటూ ఆదికి మంచి టాస్కే ఇచ్చారు. ఇందులో భాగంగా ఆది చేసిన కామెంట్లకు సంగీత హర్ట్ అయింది. ఇక్కడున్న అందరిలో కెల్లా రష్మీయే అందంగా ఉందని కామెంట్ చేశాడు.

Hyper Aadi Flurts Rashmi In Dhee
Hyper aadi Flurts rashmi In Dhee

ఆది చేసిన ఆ కామెంట్‌కు సంగీత లేచి వెళ్లిపోతాను అని చెప్పేసింది. మన గీత అందం వేరే లెవెల్ అంటూ సంగీత క్రీమ్ బిస్కేట్ వేసే ప్రయత్నం చేశాడు. గీత ఎవరంటూ? శేఖర్ మాస్టర్ ఆదికి పంచ్ వేశాడు. గీత అంటే మన గీతే అంటూ సంగీతను చూపించాడు. ఇక రష్మీని పొగిడే క్రమంలో ఆమె డ్రెస్, మేకప్, జుంకాలు ఇలా అన్నింటిని వర్ణించాడు.. ఎంత కాకాపట్టినా ఇక్కడ పడే వారు ఎవ్వరూ లేరురా అంటూ ఆర్ఆర్ వేయడంతో ఆది పరువుపోయింది.

Related Posts

తప్పదిక.. పెద్ద సినిమాలు తాడో పేడో తేల్చుకోవాల్సిందే.!

'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ సంపాదించుకుంది. కష్టకాలంలో తెలుగు సినిమాకి ఊరటనిచ్చింది 'లవ్ స్టోరీ' రిలీజ్. వాస్తవానికి 'సీటీమార్' ద్వారా ఈ వేవ్ రావల్సి ఉంది. 'సిటీమార్' తరహాలో...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

Related Posts

Latest News