ఇండస్ట్రీ టాక్ : “భగవంత్ కేసరి”కి తెలుగు స్టేట్స్ లో భారీ బిజినెస్?

ఇపుడు టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహం బాలయ్య అఖండ అలాగే వీర సింహా రెడ్డి లాంటి భారీ హిట్స్ చిత్రాలతో మళ్ళీ తన మాస్ కం బ్యాక్ ఇచ్చి తన ట్రాక్ లోకి వచ్చేయగా ఇప్పుడు బాలయ్య అయితే అదిరే ఫామ్ లో ఉన్నాడు. ఇక బాలయ్య ఇప్పుడు హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తున్న తదుపరి చిత్రమే “భగవంత్ కేసరి”.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తుండగా భారీ హైప్ ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది. కాగా ఈ చిత్రం అయితే రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండగా ఈ చిత్రానికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరే బిజినెస్ ని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

కాగా ఇప్పుడు సినీ వర్గాల్లో వస్తున్నా సమాచారం ప్రకారం మొత్తం 60 కోట్లకి పైగానే బిజినస్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో భగవంత్ కేసరి తో బాలయ్య కెరీర్ లోనే భారీ బిజినెస్ ఇప్పుడు నడుస్తుంది అని చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల అయితే ఓ కీలక పాత్ర చేస్తుంది. అలాగే బాలయ్య డ్యూయల్ షేడ్స్ లో నటిస్తుండగా థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 19న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.