బిగ్ బాస్ 4 : అభిజీత్‌ని విన్న‌ర్‌గా క‌న్‌ఫాం చేసిన 11 సెంటిమెంట్‌.. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించడ‌మే త‌రువాయి అంటున్న ఫ్యాన్స్

ప్ర‌స్తుతం ఏ ఇద్దరి మ‌ధ్యైన‌ చ‌ర్చ జ‌రిగిందంటే బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌ర‌నే ప్ర‌శ్న త‌ప్ప‌క వ‌స్తుంది. అందుకు కార‌ణం క‌రోనా టైంలో జ‌ర‌గ‌దని అనుకున్న ఈ షోని స‌క్సెస్ ఫుల్‌గా న‌డిపించి మ‌రి కొద్ది రోజుల‌లో విజేత ఎవ‌రనేది ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ సీజ‌న్‌కు ఇదే చివ‌రి వారం కావ‌డంతో ప్ర‌స్తుతం హౌజ్‌లో ఉన్న అభిజీత్, అఖిల్‌, సోహైల్, అరియానా, హారిక‌ల‌లో ఎవ‌రు విజేత‌గా నిలుస్తార‌నే దానిపై జోరుగా చ‌ర్చలు న‌డుస్తున్నాయి. ఈ షోపై ఆస‌క్తి ఉన్న కొంద‌రు సెల‌బ్రిటీలు కూడా త‌మ‌కు నచ్చిన వారికి ఓటేయ‌డమే కాక క్యాంపెయిన్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు సెంటిమెంట్స్ ఆధారంగా జోస్యాలు చెబుతున్నారు.

బిగ్ బాస్ 4 : అభిజీత్‌ని విన్న‌ర్‌గా క‌న్‌ఫాం చేసిన 11 సెంటిమెంట్‌.. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించడ‌మే త‌రువాయి అంటున్న ఫ్యాన్స్

అభిజీత్ ఈ సీజ‌న్ విన్న‌ర్ అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, ఇప్పుడు కొత్త‌గా 11 సెంటిమెంట్ అత‌నిని విజేత‌గా నిల‌బెట్టేందుకు సిద్ధ‌మైంది. అదెలా అంటే ఈ సీజ‌న్ మొత్తంలో 14 వారాలు నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌గా అందులో 11 సార్లు నామినేష‌న్‌లో ఉన్న అభిజీత్ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌, ప్రేమ వ‌ల‌న ఫినాలేకు చేరుకున్నాడు . ఈ సీజ‌న్‌లో ఎక్కువ సార్లు నామినేట్ అయిన వ్య‌క్తిగా అభిజీత్ నిల‌వగా , గ‌తంలో కౌశ‌ల్, రాహుల్‌లు కూడా 11 సార్లు నామినేట్ అయి టైటిల్ ఎగ‌రేసుకుపోయారు.

సీజ‌న్ 2లో కౌశ‌ల్‌ని ఎక్కువ సార్లు నామినేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. గీత మాధురి అయితే త‌న‌కు లభించిన సూపర్ పవర్‌తో కౌశల్‌ని సీజన్ మొత్తం నామినేట్ చేసింది. అయిన‌ప్ప‌టికి ప్రేక్ష‌కాద‌ర‌ణ వ‌ల‌న ఫినాలేకి వ‌చ్చి క‌ప్పు సాధించాడు. ఇక మూడో సీజ‌న్‌లో శ్రీముఖి.. రాహుల్‌ని అనేక కార‌ణాలు చెబుతూ నామినేట్ చేసింది. ఇత‌ను 11 వారాలు నామినేష‌న్‌లో ఉన్నాడు. ఓ సారి పున‌ర్న‌విని కాపాడే క్ర‌మంలో సీజ‌న్ మొత్తం నామినేట్ అయ్యాడు. అయిన‌ప్ప‌టికి చివ‌ర‌కు విజేత‌గా నిలిచాడు. హయ్యెస్ట్ నామినేషన్ మంత్రం ఫలించడంతో కౌశ‌ల్, రాహుల్ విన్న‌ర్ కాగా, అదే సెంటిమెంట్‌తో అభిజీత్ కూడా అవుతాడ‌ని జోస్యాలు చెబుతున్నారు. మ‌రి ఈ సెంటిమెంట్ ఎంత వ‌ర‌కు వ‌ర్కవుట్ అవుతుందో చూడాలి.