యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన కేజిఎఫ్ సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఒక కన్నడ సినిమా కూడా 1000 కోట్లు దాటుతుంది అని కేజిఎఫ్ 2 రుజువు చేసింది.
ఇక ఆ సినిమాకు కొనసాగింపుగా కేజీఎఫ్ 3 కూడా ఉంటుంది అని ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఎప్పుడు ఆ కథను తెరపైకి తీసుకు వస్తాడు అనేది కూడా అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. KGF 3 సినిమా అంతకుమించి అనేలా ఉండాలి అని దర్శకుడు ఆలోచిస్తున్నాడు. ఇక ఇటీవల ఒకసారి అయితే దర్శకుడు ప్రశాంత్, హీరో తో కలిసి పార్ట్ 3కి సంబంధించిన స్టోరీ లైన్ పై చర్చలు జరిపారట.
అయితే అది హీరోకు ఎంత మాత్రం నచ్చలేదట. ఇప్పుడు కేజీఎఫ్ బ్రాండ్ ఖండతారాలు దాటిపోయింది. కాబట్టి మూడో పార్ట్ అంతకుమించి అనేలానే ఉండాలి. అందుకే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత దీని గురించి ఆలోచిద్దాము అని హీరో దర్శకుడికి చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ ప్రభాస్ తో సలార్ సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇక మరోవైపు ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ సినిమా కు మరో రెండేళ్ల సమయం పట్టొచ్చు. ఇక కేజీఎఫ్ 3 సినిమా పై అసలు క్లారిటీ 2025 లోనే వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రావచ్చు అని టాక్ అయితే వినిపిస్తోంది.