కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ స్పీడ్‌కు బ్రేక్‌ వేసిన హాలీవుడ్‌!?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమా ‘విదాముయార్చి’. 62గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్‌ హీరోయిన్‌. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఆరవ్‌, అర్జున్‌, రెజీనా, సంజయ్‌ దత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా టీజర్‌ రిలీజైన విషయం తెలిసిందే. దీనికి మంచి స్పందన కూడా వచ్చింది. ఇక సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావడమే బాకీ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మేకర్స్‌ కి ఝలక్ ఇచ్చింది. ఇంతకీ ఏమైందంటే.. కోలీవుడ్‌ టాప్‌ హీరో అజిత్‌ కుమార్‌ లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘విదాముయార్చి’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమైంది.

అయితే ఈ సినిమా హాలీవుడ్‌ మూవీ ‘బ్రేక్‌ డౌన్‌’కి కాపీ అంటూ ఆ సినిమా ప్రొడ్యూసర్స్‌ లీగల్‌ పోరుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధం ఏర్పడింది. ఒరిజినల్‌ మేకర్స్‌ నుండి ఎలాంటి పర్మిషన్స్‌ తీసుకోకుండా లైకా సంస్థ ఈ సినిమాని తెరకెక్కించడంపై పారామౌంట్‌ నిర్మాణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక ఈ సినిమా టీజర్‌ను గమనిస్తే.. హీరో అజిత్‌ కుమార్‌ డిఫరెంట్‌ అవతార్‌లో కనిపిస్తున్నారు. ప్రపంచమంతా నిన్ను నమ్మకపోయినా పరవాలేదు.. నిన్ను నువ్వు నమ్ముకో.. అనే కాన్సెప్ట్‌తో యాక్షన్‌ బేస్డ్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కినట్లుగా ఈ టీజర్‌ చూస్తుంటే తెలుస్తోంది. అజిత్‌ దేని కోసమో అన్వేషిస్తూ.. అడ్డువచ్చిన విలన్స్‌ భరతం పడుతూ.. తాను సాధించాల్సిన లక్ష్యం కోసం ఏం చేయటానికైనా, ఎంత దూరం వెళ్లటానికైనా, ఎవరినైనా ఎదిరించేలా ఇప్పటి వరకు కనిపించని ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు.

టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్‌ లెవల్‌కు చేరుకున్నాయి. సంక్రాంతికి మెప్పించే కంటెంట్‌ ఇందులో ఉందనేది ఈ టీజర్‌ ఓ క్లారిటీ ఇచ్చేస్తుంది. కోలీవుడ్‌ మ్యూజికల్‌ రాక్‌ స్టార్‌ అనిరుద్‌ సంగీతం ఈ సినిమాకు మెయిన్‌ హైలెట్‌ అయ్యేలా అనిపిస్తోంది.