రానున్న రోజుల్లో పా ఇండియా సినిమా దగ్గర అయితే రచ్చ చేసేందుకు సిద్ధం అవుతున్న లేటెస్ట్ చిత్రాల్లో మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కూడా ఉంది. ఇక ఇది మరీ రీసెంట్ గా వచ్చిన టీజర్ తో అయితే మరో లెవెల్ కి వెళ్లి పాన్ ఇండియా ఆడియెన్స్ ని అయితే ఎంతగానో అట్రాక్ట్ చేసింది.
ఇక ఇపుడు దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రం భారీ బిజినెస్ ని చేస్తున్నట్టుగా టాలీవుడ్ సినీ వర్గాలు చెప్తున్నాయి. వారు చెప్తున్నా దాని ప్రకారం ఈ చిత్రం జస్ట్ తెలుగు స్టేట్స్ హక్కులే 55 కోట్లకి పైగా పలికినట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా ఇక పాన్ ఇండియా హక్కులు అన్నీ కలిపి ఎలా లేదన్న 70 కోట్ల మేర ఉండొచ్చని ఒక అంచనా.
దీనితో “కిక్ 2” తర్వాత రవితేజ కెరీర్ లో మరో భారీ బిజినెస్ సినిమా ఇది కాగా హైయెస్ట్ వాల్యూ వచ్చిన సినిమా కూడా ఇదే అని తెలుస్తుంది. మొత్తానికి అయితే రవితేజ పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫిగర్స్ అందుకున్న సినిమా చేసాడు. ఇక బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా సక్సెస్ అయితే తన ఫేట్ కూడా మారొచ్చని చెప్పాలి.
ఇప్పటికే చిత్ర యూనిట్ మంచి నమ్మకంగా ఉన్నారు. సినిమాకి వర్క్ చేస్తుంది కొత్త దర్శకుడు వంశీ అయినప్పటికీ కూడా ఊహించని రీతిలో తెరకెక్కించినట్టుగా మొన్న టీజర్ చూస్తే అర్ధం అయ్యింది. ఇది మాత్రం పెద్ద హిట్ కావాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.