షాకింగ్ : “టైగర్ నాగేశ్వరరావు” నిర్మాతలకి హైకోర్ట్ నోటీసులు 

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రానున్న రోజుల్లో పాన్ ఇండియా సినిమా దగ్గర ఎఫెక్ట్ చూపిస్తుంది అనిపిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం డెఫినెట్ గా మాస్ మహారాజ రవితేజ నటించిన మొట్ట మొదటి హై బడ్జెట్ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” అని చెప్పాలి.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ తెరకెక్కిస్తుండగా రీసెంట్ గా వచ్చిన టీజర్ తో ఒక్కసారిగా అన్ని అంచనాలు మారిపోగా ఈ చిత్రం కోసం అందరిలో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు వ్యక్తులు ఆధారంగా తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఈ చిత్రంలో అయితే  స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగ్వశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగానే అయితే తెరకెక్కిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి సడెన్ గా అయితే ఈ చిత్ర యూనిట్ కి హై కోర్ట్ షాకివ్వడం వైరల్ గా మారింది. ఇక మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే ఈ చిత్రంలో తమ ప్రాంతాన్ని అక్కడి మనుషులని అలాగే వారి కులాన్ని కూడా తప్పుగా చూపిస్తున్నారని..

అక్కడి జనం కేసు ఫైల్ చేయగా దీనిపై అయితే సినిమా నిర్మాతలకు గాను హై కోర్ట్ నోటీసులు పంపించింది. డెఫినెట్ గా దీనిపై నిర్మాతలు సరైన వివరణ ఇవ్వాలని ఈ నోటీసులలో ఉన్నాయట. మరి దీనికి గాను సరైన సమాధానం కోసం వారు త్వరగా ఇవ్వాలని సూచించారట. మరి దీనికి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.