కెమిస్ట్రీ సెట్టవలేదట కదా.!

ఒకే ఒక్క సినిమా హిట్టవడంతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడా యంగ్ హీరో.! మామూలుగా కాదు, అనూహ్యమైన లాభాల్ని చిత్ర నిర్మాణ సంస్థకు తెచ్చిపెట్టింది ఆ సినిమా.

ఇంకేముంది.? సీక్వెల్ ప్లాన్ చేసేశారు. హీరోయిన్ ఎంపిక విషయంలో కిందా మీదా పడ్డారు. ఎలాగోలా సినిమాని పట్టాలెక్కించారు. రిలీజ్ డేట్ విషయంలో మళ్ళీ నానా తంటాలూ పడాల్సి వస్తోంది.

అన్నట్టు, హీరోయిన్‌తో హీరోకి కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదట కెమెరా ముందర.! చిత్ర యూనిట్ నుంచే లీకులు బయటకు వస్తున్నాయ్.

రీ-షూట్‌కి వెళ్ళాలా.? అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయట. అబ్బే, అవసరం లేదని సరిపెట్టుకోవడమేనంటూ ఇంకో గాసిప్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఎక్కడ తేడా జరిగిందబ్బా.? అంటే, హీరోగారి ఓవరాక్షన్ వల్లే.. అన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.