ఓ ప్రముఖ హీరోయిన్ త్వరలో మెగాఫోన్ పట్టబోతోందట. సాధారణంగా గ్లామర్ ఫేడ్ అయ్యాకే హీరోయిన్లు మెగాఫోన్ పట్టడం కానీ, నిర్మాతలుగా మారి నిర్మాణ రంగంలో రాణించడం కానీ చేస్తుంటారు. కానీ, ఈ హీరోయిన్ వేరే.
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను తూచా తప్పకుండా పాటించేస్తున్నట్లుంది. ఓ వైపు చేతిలో రెండు మూడు ప్రాజెక్టులుండగానే డైరెక్టర్ అయిపోవాలనుకుంటోందట.
ఈ నేపథ్యంలోనే కొత్తగా చర్చల దశలో వున్న ప్రాజెక్టుల్ని పక్కన పెట్టి, సొంతంగా కథలు సిద్ధం చేసుకునే పనిలో బిజీగా వుందట. అన్నట్లు ఈ ముద్దుగుమ్మలో సింగింగ్ టాలెంట్ కూడా వుందండోయ్.
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు టైమ్ దొరికినప్పుడల్లా కథలు రాసేస్తోందట. తన సొంత కథతోనే సినిమా తీయాలనుకుంటోందట. అన్నీ కుదరితే ఆ ప్రాజెక్ట్ త్వరలోనే అనౌన్స్ చేయాలన్న గట్టి సంకల్పంతో వున్నట్లు తెలుస్తోంది.
సినిమా అనౌన్స్ చేస్తే హీరోయిన్‌గా తాను సినిమాలకు బ్రేక్ ఇచ్చేయాలనుకుంటోందట ఈ అందాల భామ. మంచి కంటెంట్ వున్న సినిమాల్ని ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా తాను మెగాఫోన్ పట్టాలనుకుంటున్నానని చెబుతోంది. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ.? ఏంటా కథ.? తెలియాల్సి వుంది.