Ashu Reddy: పెళ్లి కాకముందే తల్లి అయిన అషురెడ్డి..!

Ashu Reddy: టిక్ టాక్ స్టార్, బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు టిక్ టాక్ లో వీడియోలు చేసి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీనికి కారణం ఏంటంటే ఈ భామ సమంతా పోలికలను కలిగి ఉండడమే. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ కి బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశం సంపాదించుకుంది. అయితే ఈ భామ ఇప్పుడు ప్రముఖ టీవీ ఛానళ్లలో యాంకరింగ్ చెయ్యడం తో పాటు, కామెడీ స్టార్స్ అనే కామెడీ షో లో కూడా కనిపిస్తూ ప్రేక్షకులని నవ్విస్తుంది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీ కి యూట్యూబ్ ఛానల్ ఉండటం చాలా కామన్ అయ్యింది ఈ రోజుల్లో. అలా అషురెడ్డి కి కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ లో ఉంది. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వీడియోలని పోస్ట్ చేస్తూ ప్రేక్షకులకి టచ్ లో ఉంటుంది. ఈ క్రమం లో తాజా గా నేను ప్రెగ్నెంట్ అంటూ ఒక వీడియో పెట్టింది. ఇంకా పెళ్లి కాని అషురెడ్డి అప్పుడే తల్లి ఎలా అవుతుంది అని ఆలోచించకండి. ఇదంతా ప్రాంక్ అంటూ ముందుగానే వీడియోలో చెప్పింది.

అసలు ట్విస్ట్ ఎక్కడ ఉందంటే.. ప్రాంక్ చేస్తున్న సంగతి అషురెడ్డి వాళ్ళ అమ్మ కి తప్ప ప్రతి ఒక్కరికి తెలుసు. అలా కొద్దిసేపు అషురెడ్డి వాళ్ళ అమ్మ కి హార్ట్ ఎటాక్ తెప్పించే అంత పని చేసి చివర్లో ప్రాంక్ అంటూ బాంబు పేల్చింది. ఈ వీడియో ఫన్ కోసం చేసానే తప్ప ఎవరిని కించపరచాలని కాదు అని చెప్పింది అషు. కామెడీ కి కూడా ఒక హద్దు ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు.