కాంతార హీరో పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రజనీ కాంత్..?

ఇటీవల కన్నడ లో విడుదలైన “కాంతారా” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీన కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమాని అక్టోబర్ 15వ తేదీన తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకొని ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా కేవలం కన్నడ సినిమాగా రూపొందిన కాంతారా సినిమా ప్రస్తుతం అన్ని భాషలలో విడుదలై పాన్ ఇండియా సినిమాగా దూసుకుపోతోంది.

కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకుల తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంశాలు కురిపిస్తున్నారు. బాషతో సంబంధం లేకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి నటన గురించి ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో కంగనా రనౌత్, ప్రభాస్, అనుష్క శెట్టి, ధనుష్ వంటి వారు ఈ సినిమా సూపర్ హిట్ అంటూ ప్రశంశలు కురిపించారు.

ఇక తాజాగా ఈ సినిమా ని కోలీవుడ్ స్టార్ హీరో రజనీ కాంత్ వీక్షించారు. ఈ సినిమా చూసిన తర్వాత సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదిక గా స్పందిస్తూ.. ” తెలిసినది గోరంత తెలియనిది కొండంత.. ఈ విషయాన్ని ఈ సినిమా లో మీకంటే బాగా ఎవరూ చెప్పలేరు. ఈ సినిమా చూస్తుంటే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భారతీయ సినీ చరిత్రలోనే ఇదొక మాస్టర్‌ పీస్‌. రచయిత, దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టి ట్యాలెంట్‌కు నా హ్యాట్సాఫ్‌ అంటూ రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపించాడు. అంతే కాకుండా చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియచేస్తూ.. నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌పై ప్రశంసలు కురిపించారు .