యశోద సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మి శరత్ కుమార్…?

సమంత కీలకపాత్రలో నటించిన యశోద సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలంక కృష్ణ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ యశోద సినిమా నవంబర్ 11వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలో సమంత కీలకపాత్రలో నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. యశోద సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాలో సమంత పాత్రలో లీనమై నటించింది. ఇక సినిమాటోగ్రాఫర్ సుకుమార్ గారు ఈ సినిమాని అద్భుతంగా షూట్ చేశారు. ఇక ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో నా పాత్రకు , సమంత పాత్రకు ఒక చిన్న రిలేషన్ ఉంటుంది. ఈ సినిమాలో నేను గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించడం నాకు చాలెంజింగ్ గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది.

యశోద సినిమా చూడటానికి కొనే టికెట్ కి కచ్చితంగా వాల్యూ ఉంటుంది అంటూ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వరలక్ష్మి శరత్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సమంత నటించిన పుష్ప సినిమా తర్వాత విడుదల అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.