వెండితెరపై అనేక హావభావాలు ప్రదర్శిస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరించే నాయకానాయికల జీవితంలోను ఎన్నో విషాదాలు ఉంటాయి. వాటన్నింటిని దిగమింగుకొని ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంటారు. కొందరు మాత్రం కష్టాలని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం వంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారిలో ఆనంద్..మంచి కాఫీలాంటి సినిమా హీరో రాజా కూడా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కెరీర్ తొలినాళ్ళలో బాగానే అలరించిన ఈ హీరో తర్వాత తర్వాత మెల్లగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు
2004లో శంకర్ దాదా ఎంబీబీస్ చిత్రానికి పోటీగా విడుదలై ఆనంద్ మంచి విజయం సాధించింది. ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కగా, బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మాయా బజార్, వెన్నెల, ఇంకోసారి, ఓ చినదాన ఇలా చాలా సినిమాలు చేసాడు రాజా. గత ఎనిమిది ఏళ్ళుగా రాజా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. కెరీర్‌ని పూర్తిగా మార్చి మత ప్రబోధకుడిగా మారి అందరికి షాకింగ్ ఇచ్చాడు. అయితే సినిమాల నుండి తప్పుకొని ఇలా పాస్టర్ గా మారడం వెనుక కారణమేంటని అందరు ఆశ్చర్యపోయారు.
ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో రాజా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు వచ్చిన వార్తలపై తాజాగా అలీతో సరదాగా షోలో క్లారిటీ ఇచ్చాడు. గ్రీన్ పార్క్ హోటల్‌లో రిసెప్షన్‌గా కూడా తాను పని చేశానని అన్నాడు రాజా. సినిమాలు లేక అవకావాలు రాకపోవడంతో డిప్రెషన్‌కి వెళ్లిన తాను ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం అని అనుకున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. అందులో ఒక్కటి కూడా నిజం లేదు. చచ్చిపోవలసిన అవసరం నాకు లేదు. ఐదేళ్లకే అమ్మను.. 14 ఏళ్లకే నాన్ను పోగొట్టుకున్న తనకు జీవితం విలువ తెలుసు అంటున్నాడు రాజా.