ఆయనో పెద్ద కథా రచయిత.! ఆయనో ప్రముఖ దర్శకుడు.! ఆయనో ప్రముఖ హీరో.! ఓ మంచి కథ.! ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా వుంది.! అన్నీ వున్నా, అల్లుడి నోట్లో శని అంటారు కదా.. అచ్చం అదే పరిస్థితి ఇక్కడ.!
ఒక్క హీరో, ఒక్క దర్శకుడు, ఒక్క నిర్మాత గురించిన వ్యవహారం కాదిది.! తెలుగు సినీ పరిశ్రమలో హీరోల కొరత, దర్శకుల కొరత, నిర్మాతల కొరత.. చివరికి హీరోయిన్ల కొరత కూడా ఎక్కువైపోయింది.
బోల్డంతమంది హీరోలున్నారు.. బోల్డంతమంది దర్శకులు.. బోల్డంతమంది నిర్మాతలు.. ఇలా అందరూ వున్నారు కదా.? అయినాగానీ అంతే.! ఏడాదికి పైనే ఒక్కో సినిమా.! ఒక్కోసారి రెండు, మూడు, నాలుగేళ్ళు పట్టేస్తోంది సినిమా అంటే. అదే అసలు సమస్య.
తీరా విడుదలయ్యాక, ప్రేక్షకులు ఏకపక్షంగా తిరస్కరిస్తే.. అంతే సంగతులు.! భయం.. మామూలు భయం కాదు, సినీ పరిశ్రమని విపరీతమైన భయం వెంటాడుతోంది. ‘హనుమాన్’ సినిమా ఆడెయ్యలేదా.? అంటే, అది స్పెషల్ కేస్.
ఇప్పుడిదంతా ఎందుకంటే, ఓ ప్రముఖ హీరోతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఓ ప్రముఖ దర్శకుడితో ప్రారంభించాల్సిన సినిమా పట్టాలెక్కుతుందో, మొదలవకముందే ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ముగ్గురూ కలిసి, ఆ ప్రాజెక్టు భవిష్యత్తు గురించి తెగ బాధపడిపోతున్నారట. ఎంత కష్టమొచ్చింది కదా.!
పైగా, ఆ హీరో ఫ్లాపు మీదేమీ లేడు, హిట్టు కొట్టే వున్నాడు. బడ్జెట్, టైమింగ్.. వీటి విషయంలో రిస్క్ ఫ్యాక్టర్ భరించలేక ఈ గందరగోళమట.