శంకర్ రెండు చిత్రాల్లో కూడా అతడే విలన్.!

991953-director-shankar

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ఏమో కానీ అసలు అసలు పాన్ ఇండియా మార్కెట్ అంటే ఏంటో చాలా  సమయంలోనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని ఇండియన్ సినిమాకి సెట్ చేసిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కోలీవుడ్ విజనరీ డైరెక్టర్ శంకర్ అనే చెప్పాలి.

శంకర్ తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు ఇండియన్ సినిమా దగ్గర అదరగొట్టాయి. ఇక ఇపుడు అయితే మంచి హిట్ కోసం చూస్తుండగా ఇప్పుడు తాను రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ని ఒకేసారి చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర అయితే రెండు భారీ చిత్రాలు ఒకేసారి చేస్తున్న దర్శకుడిగా శంకర్ నిలవగా.

తాను రామ్ చరణ్ తో “గేమ్ చేంజర్” అలాగే ఉలగనయగన్ కమల్ హాసన్ తో అయితే భారీ చిత్రం “ఇండియన్ 2” ని ఒకేసారి చేస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ లో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య అయితే విలన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇపుడు శంకర్ మరో సినిమా ఇండియన్ 2 లో కూడా ఎస్ జే సూర్య నే విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది.

ఇలా ఇప్పుడు శంకర్ చేస్తున్న రెండు సినిమాల్లో కూడా ఒకరే విలన్ గా కనిపించనుండడం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ భారీ చిత్రాలు ఒకదానితో ఒకటి వరుస షెడ్యూల్స్ తో తెరకెక్కుతూ ఉండగా ఒకదాని షూటింగ్ ఆధారంగా మరొకటి తెరకెక్కి రిలీజ్ కానున్నాయి.