అతను స్వీట్ హార్ట్… సంస్కారం తెలిచిన వ్యక్తి ఆ హీరో పై ప్రశంసలు కురిపించిన రమ్యకృష్ణ?

వెండితెరపై తెలుగు తమిళ భాషలలో ఒకానొక సమయంలో ఆగ్రనటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి పరిచయం అవసరం లేదు ఈమె తెలుగులో హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి మెప్పించారు.కేవలం కమర్షియల్ చిత్రాల ద్వారా మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా కూడా రమ్యకృష్ణ తన టాలెంట్ నిరూపించుకున్నారు. ఈ విధంగా వరుస సినిమాలలో నటించి ఒకానొక సమయంలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా అలాగే కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం ఎన్నో సినిమాలలో నటిస్తూ హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలలో ఇమిడిపోయారు. ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కావడంతో చిత్ర బృందం ఇంటర్వ్యూలో పాల్గొంటు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు తల్లి పాత్రలో నటించిన రమ్యకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈమె ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలను పంచుకోవడమే కాకుండా ఆమె 1996 నాటి చాహత్‌ సినిమా గురించి ముచ్చటించారు.

ఈ సినిమాలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ విలన్ పాత్రలో సందడి చేశారు. అప్పటి విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక స్వీట్ హార్ట్.. సంస్కారం తెలిసిన వ్యక్తి అంటూ షారుక్ ఖాన్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. షారుక్ ఖాన్ తన ప్రవర్తనతో తన చుట్టూ ఉన్నవారిని ఇట్టే ఆకట్టుకుంటారని, రోజంతా కూడా ఎంతో ఎనర్జీగా కనిపిస్తూ ఉంటారని,ఈ సందర్భంగా ఈమె తాను నటించిన చాహత్ సినిమా గురించి, షారుక్ ఖాన్ గురించి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.