ఒక్క సినిమాతో సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అమాంతం ఆయన మార్కెట్‌తో పాటూ, రెమ్యునరేషన్ కూడా విపరీతంగా పెరిగిపోయాయ్. అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరో అయిపోయాడు విజయ్.
అయితే, ఒక్క సినిమా ‘లైగర్’ అంతా కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్‌కి దారుణంగా డ్యామేజ్ చేసేసింది. ఎంత ప్రయత్నించినా ఆ డ్యామేజ్‌ని పూడ్చుకోలేకపోతున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ మార్కెట్ ప్రస్తుతానికి సగానికి పడిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. ‘లైగర్’కి ముందున్న స్టార్‌డమ్‌లో సగం కూడా లేదంటున్నారు ప్రస్తుతం వీడీ మార్కెట్.
సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఖుషీ’కి జీరో బజ్ నడుస్తోంది. అలాగే, గౌతమ్ తిన్ననూరి సినిమాని సైతం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కేవలం ఒకే ఒక్క సినిమా మరీ ఇంత దారుణంగా ఓ హీరో సక్సెస్‌ని దెబ్బ తీసేస్తుందా.? అంటే, ఇదిగో విజయ్‌ని చూస్తే తెలియడంలా.? అంటూ పాపం రౌడీని ఎగ్జాంపుల్‌గా చూపించేస్తున్నారు.