బ్రహ్మాస్త్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కేసీఆర్ఆర్ రద్దు చేయించారా.. వైరల్ అవుతున్న న్యూస్?

ర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సౌత్ లో రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ని గెస్ట్ గా ఆహ్వానించారు.

అయితే వినాయక చవితి సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భద్రత కల్పించలేమని చివరి నిమిషంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసారు. ఆ తర్వాత ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవటంతో సినిమా యూనిట్ ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత చివరి నిమిషంలో పోలీసులు ఇలా అనుమతి రద్దు చేయడం చాలా అన్యాయమని పోలీసులు అనుమతి తీసుకున్న తర్వాతే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని పనులు చేసుకున్నారని చిత్ర బృందం తెలిపింది. భద్రత వంకతో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని రద్దు చేసుకోమని పోలీస్ శాఖ కోరిందంటే నమ్మశక్యంగా లేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ని అతిధిగా ఆహ్వానించడం వల్లే ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ అమిత్ షా తో భేటీ అయ్యాడు. ఈ క్రమంలో ఎన్నికలలో బిజెపి తరఫున ప్రచారం చేయవలసిందిగా అమిత్ షా ఎన్టీఆర్ ని కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బిజెపి పట్ల తీవ్ర వ్యతిరేకత చూపుతున్న సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ మీద ఉన్న కోపంతోనే బ్రహ్మాస్త్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చివరి నిమిషంలో భద్రత సాకుతో నిలిపివేశాడని ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు.