రాను రాను బిగ్ బాస్ హౌజ్ హీటెక్కుతుంది. అయితే కొంత చల్లబడుతుంది అనుకునే సమయంలో హీట్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు పెద్దాయన. అఖిల్, అభీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా ఉండేది ఒకప్పుడు. కాని రాను రాను వారిద్దరు చాలా క్లోజ్ అవుతున్నారు. ఇది గ్రహించిన బిగ్ బాస్ ఇద్దరి మధ్య స్టిక్స్ వేయడం మొదలు పెట్టాడు. అఖిల్‌ని సీక్రెట్ రూంలోకి పంపి అభిజిత్ తన గురించి ఏమేం మాట్లాడుతున్నాడో వినే ఛాన్స్ అఖిల్‌కి కల్పించాడు. దీంతో అఖిల్ సీక్రెట్ రూం నుండి బయటకు రావడంతో ఇద్దరి మధ్య వైరం పీక్ స్టేజ్‌కు వెళుతుందని అర్ధమవుతుంది.
ఇక తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో హౌజ్‌మేట్స్‌కు వారి కుటుంబ సభ్యులు లేఖలు రాసారు. ఆ లేఖలు ఎవరికి ఇవ్వాలి వద్దు అనేది అఖిల్ చేతిలోనే ఉంటుంది. ప్రస్తుతం హౌజ్‌లో అఖిల్‌ని మిస్ అవుతున్న బాధ మోనాల్, సోహైల్‌లోనే కనిపిస్తుంది. మిగతా వారంతా ఆయన పోవడం మంచిగా అయిందనే భావనలో ఉన్నారు. ఇదంతా సీక్రెట్ రూం నుండి గమినస్తున్నాడు అఖిల్. దీంతో కొందరి లేఖలని చింపేసి ఇంటి సభ్యులకు పంపిచినట్టు ప్రోమోని బట్టి అర్ధమవుతుంది. మరోవైపు ఇంటి సభ్యులు ఇంతవరకు ఎవరికీ చెప్పని రహస్యాలను బయటపెట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు.
బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ముందుగా సోహైల్ తనలైఫ్‌లో చేసిన కొన్ని తుంటరి పనులు చెప్పుకొచ్చాడు. ఫేక్ తల్లిదండ్రులనే క్రియేట్ చేసినట్టు బిగ్ బాస్ సాక్షిగా ఒప్పుకున్నారు. ఇక ఇన్నాళ్లు తన రిలేషన్‌పై ఓపెన్ కాని దేత్తడి హారిక తన ప్రేమ విషయాన్ని బట్టబయలు చేసింది. రెండేళ్ళ క్రితం అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. మిగతా వివరాలన్నీ ఈ రోజు ఎపిసోడ్‌లో వివరించనున్నట్టు తెలుస్తుంది. అయితే హారిక రిలేషన్‌లో ఉన్నట్టు చెప్పడంతో అభిమానులు ఏం చేస్తున్నాడో చెప్తావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సింపథీ గేమ్స్ ఆడుతున్న లాస్య, అరియానాలు సవాళ్ళను చెప్పుకొచ్చారు. ఈ రోజు ఎపిసోడ్ కాస్త రంజుగానే ఉంటుందని తాజా ప్రోమోని బట్టి అర్దమవుతుంది.