“సలార్” కి అసలైన అగ్ని పరీక్ష..!

ఇటీవల ఇండియన్ సినిమా దగ్గర పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వచ్చిన ఏకైక చిత్రం ఏదన్నా ఉంది అంటే అది పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “సలార్” అని చెప్పాలి. మరి “సలార్” తో ప్రభాస్ ఫైనల్ గా హిట్ అందుకోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా తన కెరీర్ లో మరో హిట్ అందుకున్నాడు.

కాగా ఈ డిసెంబర్ 22న రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొదటి వీకెండ్ సహా 25 క్రిస్మస్ హాలిడే కూడా బాగా కాష్ చేసుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా టోటల్ వరల్డ్ వైడ్ కూడా భారీ వసూళ్లు కొల్లగొట్టిన ఈ చిత్రానికి అసలు సిసలు అగ్ని పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పాలి.

ఎందుకంటే ఈ సోమవారంతో సెలవు దినాలు అయ్యిపోయాయి. ఇక మంగళవారం నుంచి వర్కింగ్ డేస్ స్టార్ట్ అవుతాయి. ఈ రోజులు నుంచి సలార్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది ప్రశ్న ఒకవేళ సినిమా ఈరోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడింది అంటే ఇక లాంగ్ రన్ పై ఎలాంటి డౌట్ పెట్టుకొనవసరం లేదు.

లేదా భారీగా డ్రాప్ అయ్యింది అంటే మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది. సో ఈ రకంగా అయితే సలార్ కి రేపటి నుంచి ఇది అగ్ని పరీక్షే అని చెప్పి తీరాలి. ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష్ కూడా మొదటి మూడు రోజులు సూపర్ గా వసూళ్లు రాబట్టి వర్కింగ్ డేస్ నుంచి డిజాస్టర్ వసూళ్లు అందుకుంది. మరి సలార్ కి కూడా అదే రిపీట్ అయితే ఏమి చెయ్యలేం..