“హనుమాన్” టీజర్ రెడీ..ఈ సినిమా గేమ్ ఛేంజర్ కాబోతుందా.?

ప్రపంచ వ్యాప్తంగా అనేక జానర్స్ లో సినిమాలు ఉన్నాయి. మరి పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా బడ్జెట్ ని బట్టే సినిమాలు కూడా నిర్మాణం అవుతాయి అనేది లెక్కలోకి వస్తుంది. అయితే మన ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడిప్పుడే ఫాంటసీ చిత్రాలు ఎక్కువ అవుతున్నాయి.

అలాగే మన టాలీవుడ్ నుంచి లేటెస్ట్ గా బింబిసార ఈ తరహా చిత్రాల్లో ఒకటిగా మ్యాజిక్ చేసింది. ఇక నెక్స్ట్ అయితే ఆదిపురుష్ మాయాజాలంతో రానుంది. వీటితో పాటుగా పాన్ ఇండియా లెవెల్లో రెడీగా అవుతున్న మరి టాలీవుడ్ సినిమా “హనుమాన్”.

తన మొదటి సినిమా “అ” సినిమా తో హాలీవుడ్ లెవెల్ టేకింగ్ చూపించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ నెక్స్ట్ కూడా కొత్త జానర్స్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అలాగే తెలుగు నుంచి మొదటి సూపర్ హీరోగా హనుమంతుని శక్తితో హనుమాన్ అనే సినిమాని యంగ్ హీరో తేజ సజ్జ తో ప్లాన్ చేసాడు.

మన తెలుగు నేటివిటీ పోకుండా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు మేకర్స్ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ నవంబర్ 21న ఈ టీజర్ మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

అయితే ఇది చిన్న హీరో సినిమా కావచ్చు కానీ కాన్సెప్ట్ మరియు దర్శకునిపై ఉన్న నమ్మకం పెద్దది అందుకే ఇందులో విజువల్స్ అండ్ ఏక్షన్ అనుకున్న లెవెల్లోనే ఉంటాయని చాలా మంది ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా కానీ ఊహలకి మించే ఉంటె టాలీవుడ్ దగ్గర తప్పకుండ మంచి గేమ్ ఛేంజర్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.