బాక్సాఫీస్ బ్లాస్ట్ : డే 25కి “హనుమాన్” కనీ వినీ ఎరుగని వసూళ్లు.!

ఈ ఏడాది ఎన్నో ఒడిదుడుకులు మధ్య థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో తేజ సజ్జ అలాగే హీరోయిన్ అమృత అయ్యర్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “హనుమాన్”. కాగా తెలుగు నుంచి మొదటి సూపర్ హీరో సినిమా అన్నప్పటికీ ఈ చిత్రం డివోషనల్ టచ్ బాగా హైలైట్ కావడంతో వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు.

కాగా ఈ చిత్రం అసలు ఎవరూ ఊహించని విధంగా 100 కోట్ల వసూళ్ళని ముందు క్రాస్ చేయడం ఒకెత్తు అయితే అది కాస్తా 200 కి వెళ్ళింది 250 కి కూడా వెళ్లి సంచలనం సృష్టించింది. ఇప్పుడు వీటి తర్వాత మరో కనీ వినీ ఎరుగని రికార్డు 300 కోట్ల క్లబ్ లో చేరినట్టుగా మేకర్స్ తెలిపారు.

దీనితో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అనేది అర్ధం చేసుకోవాలి. ఇప్పటికే 100 కోట్లకి పైగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ లాభాలు అందించింది. దీనితో ఇప్పుడు పార్ట్ 2 పై అంచనాలు పీక్స్ లోకి వెళ్లాయి. మరి ఈ సినిమా కానీ వర్కౌట్ అయితే ఆ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.

కాగా ఈ భారీ చిత్రం ఇప్పటికీ తెలుగు సహా హిందీ లో కూడా మంచి రన్ తో దూసుకెళ్తుండగా ఇంత చిన్న చిత్రం సాధించిన విజయం చిత్ర యూనిట్ పై మరింత బాధ్యతని అయితే తెచ్చి పెట్టింది అని చెప్పాలి. ఈ సినిమాలో సాధారణ కాస్టింగ్ తోనే ఈ లెవెల్లో అదరగొడితే “జై హనుమాన్” లో చాలా పెద్ద పేర్లే వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో అనేది.