ఈ ఏడాదిలో కంప్లీట్ గా ఓ టాలీవుడ్ హీరో నుంచి గాని దర్శకుడు కాంబినేషన్ నుంచి ఒక గ్రాండ్ సినిమా అయితే రాలేదు.. ఇది టాలీవుడ్ లో ఈ ఏడాది ఓ బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పవచ్చు. కానీ చాలా వరకు చిన్న సినిమాలు మాత్రమే భారీ హిట్ అయ్యాయి. అయితే వచ్చే ఏడాది మాత్రం రానున్న సినిమాల్లో సంక్రాంతికే వస్తున్నా ఓ లార్జర్ థన్ లైఫ్ భారీ చిత్రం “హనుమాన్”.
ఈ సినిమాపై చాలా మందిలో మంచి అంచనాలు ఇపుడు కాదు గత ఏడాది నుంచే ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” షిఫ్ట్ కావడంతో పోటీ మరింత టఫ్ గా మారింది. దీనితో ఆ సినిమా మూలాన ఈ సినిమాకే నష్టం అని చాలా మంది వార్న్ చేస్తున్నారు.
కానీ సినిమా రిలీజ్ డేట్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఈరోజు ట్రైలర్ తో కూడా కన్ఫర్మ్ చేశారు. దీనితో పోటీ మరింత టైట్ అవుతూ వస్తుంది. అయితే అంత పెద్ద హీరో సినిమా ఉన్నపుడు ఎందుకు వస్తున్నారు అనే ప్రశ్నకి దర్శకుడు ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది.
తాము అందరికన్నా డేట్ అనౌన్స్ చేశామని సో తప్పకుండా ఏది ఏమైనా కూడా అదే డేట్ కి వచ్చి తీరుతామని చెప్పేసాడు. అంటే అవతల ఎలాంటి సినిమా ఉన్నా కూడా తమ సినిమా తగ్గేది లేదని కన్ఫర్మ్ చేసేసాడు. దీంతో తన స్టేట్మెంట్ ఇపుడు చర్చగా మారింది. మరి ఈ రెండు భారీ సినిమాలు ఒకే డేట్ లో వస్తే దేనికి నష్టమో లేక రెండు సినిమాలని ఆడియెన్స్ ఆదరిస్తారో చూడాలి.