క్రేజీ : “హనుమాన్” కి వరల్డ్ వైడ్ మరింత గ్రాండ్ ప్లానింగ్స్?

టాలీవుడ్ నుంచి వచ్చిన ఓ చిన్న సినిమా ఇప్పుడు పలు పెద్ద  రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంది అని ఎవరు కూడా ఊహించి ఉండరు. మరి ఆ చిత్రమే హనుమాన్ కాగా  ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా తేజ్ అసజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.

కాగా ఈ చిత్రంని మేకర్స్ అనౌన్స్ చేసినప్పుడే పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేశారు. తర్వాత టీజర్ చూసాక వచ్చిన రెస్పాన్స్ మాత్రం పాన్ వరల్డ్ లెవెల్లో వచ్చింది. అయితే రిలీజ్ కూడా వరల్డ్ వైడ్ పలు భాషల్లో ఉంటుంది అని తీసుకొచ్చారు కానీ ఇప్పుడు పాన్ ఇండియా భాషల్లోనే రిలీజ్ అయ్యింది.

కాగా ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కి మరింత గ్రాండ్ ప్లానింగ్ లు చేస్తున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ సినిమాని మేకర్స్ 3డి లో రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ లు చేస్తున్నారట. అయితే ఇది ఇండియా లోనే కాకుండా తాము ఇది వరకు అనౌన్స్ చేసిన చైనీస్, జపాన్ కొరియా సహా ఇతర భాషల్లో కూడా అప్పుడు రిలీజ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ప్రస్తుతం 3డి వెర్షన్ టెక్నికల్ పనులు చేస్తుండగా ఇవి పూర్తయ్యాక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏప్రిల్ లేదా మే లో రావచ్చని సమాచారం. మొత్తానికి అయితే ఆగింది అనుకున్న వరల్డ్ వైడ్ రిలీజ్ మరింత గ్రాండ్ గా చేస్తున్నారు అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు నటించగా నిరన్జన్ రెడ్డి నిర్మాణం వహించారు.