అఫీషియల్ : హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా ఇదే 

ఇప్పుడు ఇండియా సినిమా దగ్గర మరోసారి తెలుగు సినిమా సత్తా చాటుతుండగా ఆ సినిమానే “హనుమాన్”. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరక్కేకించిన ఈ సాలిడ్ సూపర్ హీరో చిత్రం ఊహలకి మించి పెద్ద హిట్ కాగా యంగ్ హీరో తేజ సజ్జ కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ లా నిలిచింది.

మరి ఈ భారీ చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి మరిన్ని సూపర్ హీరో చిత్రాలు వస్తుండగా ఈ చిత్రాల్లో హనుమాన్ తోనే పార్ట్ 2 హనుమాన్ సీక్వెల్ గా “జై హనుమాన్” ని కన్ఫర్మ్ చేసాడు. కాగా ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.

ఈ సినిమా వెంటనే ఉంటుందా లేక ప్రశాంత్ వర్మ ఎప్పుడో స్టార్ట్ చేసిన మరో సూపర్ హీరో చిత్రం “అధీరా” రిలీజ్ అవుతుందా అనేది ప్రశ్నగా మారగా దీనికి అఫీషియల్ క్లారిటీ అయితే యంగ్ దర్శకుడు ఇచ్చేసాడు. తన నుంచి నెక్స్ట్ రిలీజ్ చేసే చిత్రం హనుమాన్ పార్ట్ 2 అని కన్ఫర్మ్ చేసాడు.

మరి నిన్ననే అయోధ్యలో రామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పార్ట్ 2 తాలూకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలిపాడు. దీనితో ప్రశాంత్ వర్మ నుంచి నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా జై హనుమాన్ అనే చెప్పవచ్చు. కాగా ఈ భారీ చిత్రానికి నిరంజన్ రెడ్డి నిర్మాణం వహిస్తుండగా పార్ట్ 2 ని మరింత గ్రాండ్ లెవెల్లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.