ఈసారి దెబ్బ మామూలుగా ఉండదంటున్న “హనుమాన్” దర్శకుడు 

ఇపుడు మన తెలుగు సినిమా ఏ రకంగా షైన్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. నిజం అబద్దం అనేది పక్కన పెడితే కష్టానికి దైవ సంకల్పం తోడైతే దాని తాలూకా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుగు సినిమా నుంచి ఇప్పుడు “హనుమాన్” సినిమా చూపిస్తుంది. భగవాన్ హనుమాన్ అంశతో యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జతో చేసిన ఈ చిత్రం హనుమాన్ మూలాన ఊహించని రేంజ్ హిట్ అయ్యింది.

దీనితో ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏకంగా ఈ సినిమా అసలు ఎవరు ఊహించని విధంగా 200 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. దీనితో చిన్న సినిమాగానే వచ్చినప్పటికీ ఈ చిత్రంపై సీక్వెల్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. కాగా రీసెంట్ గానే దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసినట్టుగా తెలిపాడు. ఇక దీని తర్వాత మరో బిగ్ అప్డేట్ ని తాను అందించాడు.

మీ అందరికీ తప్పకుండా ఋణపడి ఉంటానని ఇప్పుడే కొత్త అధ్యాయానికి ఆరంభం పలికాను మీ కేర్, ప్రేమతో ఈసారి చూపించబోయేది గ్లోబల్ వైడ్ సెలెబ్రేట్ చేసుకునే విధంగా ఉంటుంది అని జై హనుమాన్ తో ప్రామిస్ చేస్తున్నానని తెలుపుతున్నాడు. దీనితో జై హనుమాన్ పట్ల ఇప్పుడు మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈసారి తాను కొట్టే దెబ్బ ఏ లెవెల్లో ఉంటుందో చూడాల్సిందే.