ఇప్పుడు ఇండియా వైడ్ గా వినిపిస్తున్న మరో సౌత్ దర్శకుడు అందులోని మరో ప్రశాంత్ ఎవరు అంటే అది హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అని చెప్పాలి. గత డిసెంబర్ అంతా సలార్ తో ప్రశాంత్ నీల్ పేరు మారుమోగితే ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ తో ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు మోగుతుంది.
భారీ వసూళ్లతో భారీ లాభాలతో కూడా దూసుకెళ్తున్న ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలెంట్ ఏంటో కూడా అందరికీ అర్ధం అయ్యింది. కాగా ఈ టాలెంట్ తోనే ఇప్పుడు తన నుంచి మరిన్ని భారీ చిత్రాలు వస్తుండగా వాటిపై కూడా గట్టి అంచనాలు నెలకొన్నాయి.
కాగా దీనితో పాటుగా ఓ షాకింగ్ న్యూస్ కూడా ప్రశాంత్ వర్మ విషయంలో ఇప్పుడు వైరల్ గా మారింది. తనకి ఇటీవల 1000 కోట్ల ఆఫర్ వచ్చింది అంటూ తాను తెలిపాడు. అయితే తనకి ఈ ఆఫర్ ని ఓ ఎన్నారై అందించారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మధ్య ప్రశాంత్ వర్మ సింపుల్ గానే చెప్తున్నా కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ వింటే చాలా మందికి నచ్చడం లేదు కావాలని డబ్బా కొడుతున్నాడో ఏంటో అని అనుకుంటున్నారు.
కానీ తాను మాత్రం తన టాలెంట్ తో చాలా మంది నోర్లు మూయించాడు. మరి రానున్న రోజుల్లో అయితే తన నుంచి వచ్చే చిత్రాలు ఇదే హనుమాన్ లెవెల్లో ఉంటాయో లేదో అనేది వేచి చూడాలి. కాగా ఇప్పుడు తాను ఇమీడియేట్ గా జై హనుమాన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి అందులో బిజీగా ఉన్నాడు.