ఓ సినిమాని మన తెలుగు ఆడియెన్స్ ప్రేమించినంతగా మరో ఆడియెన్స్ అయితే ఆ రేంజ్ లో ప్రేమించరు అని చెప్పాలి అందుకే ఇతర ఇండస్ట్రీ హీరోస్ చాలా మందికి వాళ్ళ ఆడియెన్స్ కన్నా మన ఆడియెన్స్ అంటేనే కూసింత ప్రేమ ఎక్కువ ఉంటుంది. మరి పర భాషా చిత్రాలనే నెత్తిన పెట్టుకునే మన వాళ్ళు ఇక తెలుగు సినిమా నుంచి ఒక లాంగ్ రన్ సినిమా పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మరోసారి చూపించారు.
అలాగే భారీ లెవెల్లో లాంగ్ రన్ అండ్ సాలిడ్ వసూళ్లు అందించిన ఆ అఖండ విజయ చిత్రమే “హనుమాన్”. యువ హీరో తేజ సజ్జ దర్శకుడు ప్రశాంత్ వర్మ కలయికలో వచ్చిన రెండో సినిమా ఇది కాగా భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. మరి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా హిస్టారికల్ రన్ ని ఈ 92 ఏళ్ల సినీ చరిత్రలో సెట్ చేసినట్టుగా మేకర్స్ చెబుతున్నారు.
కాగా ఇన్నేళ్ల హిస్టరీలో సంక్రాంతి బరిలో వచ్చిన అన్ని హిట్ చిత్రాలని మించి ఇప్పుడు హను మాన్ కి వసూళ్లు రావడం విశేషం సుమారు ఈ చిత్రానికి ఏకంగా 270 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. దీనితో ఈ రేస్ లో వచ్చిన చిత్రాల్లో ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ వసూళ్లు వచ్చింది లేదు.
అయితే చాలా మంది స్టార్ హీరోస్ నెక్స్ట్ ఈ రికార్డుని బద్దలు కొట్టవచ్చు కానీ ఇంత చిన్న హీరో సుమారు 40 కోట్ల లోపు బడ్జెట్ తో వచ్చిన ఈ చిన్న చిత్రం ఈ రేంజ్ లో దుమ్ము లేపుతుంది అని ఎవరూ భావించి ఉండకపోవచ్చు బహుశా మళ్ళీ ఈ రేంజ్ లో హిట్ అయ్యే సినిమా కూడా రాకపోవచ్చు. అందుకే ఈ సినిమా విజయంతో మాత్రం నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.