ఇండస్ట్రీ టాక్ : “హనుమాన్ 2” వచ్చేది అప్పుడు కాదా??

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర గట్టిగా వినిపిస్తున్న మన తెలుగు సినిమా పేరు “హనుమాన్”. కాగా చాలా కాలం తర్వాత తెలుగు నుంచి వచ్చిన ప్రాపర్ పాన్ ఇండియా సినిమా ఇది కాగా ఈ చిత్రం అనుకున్న అంచనాలు రీచ్ అవ్వడమే కాకుండా అంతకు మించే రన్ ని కొనసాగిస్తుంది.

దాదాపు ఒక టైర్ 1 హీరో సినిమాకి ఎలాంటి స్టడీ వసూళ్లు డైలీ నమోదు అవుతాయో ఈ చిత్రానికి కూడా వస్తున్నాయి. ఇక ఈ లెవెల్లో అదరగొడుతున్న సంగతి అంతా చూస్తున్నారు. కాగా ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లైమాక్స్ లో కన్ఫర్మ్ చేయగా ఆ రెండో భాగం ఎలా ఉంటుంది అనేది అందరిలో ఆసక్తి రేపింది.

“ది హనుమాన్” అంటూ అనౌన్స్ చేసిన ఈ చిత్రం 2025 లో రిలీజ్ చేస్తారని కన్ఫర్మ్ చేశారు. ఇక మరో పక్క సినీ వర్గాల్లో మళ్ళీ ఇదే ప్రశాంత్ వర్మ నుంచి ఓ చిత్రం 2025 సంక్రాంతికి వస్తుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి మళ్ళీ సంక్రాంతికి వచ్చేది కూడా హనుమాన్ పార్ట్ 2 నే అని చాలా మంది అనుకుంటున్నారు.

అయితే ఆ సినిమా హనుమాన్ 2 కాకపోవడానికి కొన్ని కారణాలు లేకపోలేవు. ఎందుకంటే ప్రశాంత్ వర్మ తన సినిమా యూనివర్స్ లో లింక్ అయ్యి ఉన్న మరో సూపర్ హీరో చిత్రం తన డైరెక్షన్ లో చేస్తున్న సినిమా “అధీర” కూడా ఒకటి. డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి నటిస్తున్న ఈ సినిమా కూడా గ్లింప్స్ తో చాలా ఆసక్తి రేపింది.

మరి ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది మరి ఈ సినిమా వచ్చే స్కోప్ ఉందని కూడా చెప్పుకోవాలి. దీనితో వచ్చే ఏడాది సంక్రాంతికి ఆ సినిమా వస్తుందో లేక హనుమాన్ 2 వస్తుందో అనేది మున్ముందు క్లారిటీ రానుంది.