పెళ్లి జరిగిన నెలకే గుడ్ న్యూస్ చెప్పిన హన్సిక…. ఆ విషయంలో హన్సిక చాలా ఫాస్ట్ సుమ!

గత ఎడాది తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకున్నటువంటి వారిలో హన్సిక ఒకరు. ఈమె తన బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కతురియా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి వివాహం ఇంకా తేడాది డిసెంబర్ 4వ తేదీ జైపూర్ లోని ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వేరే వివాహం జరిగి నెల కూడా తిరగకుండానే ఈమె శుభవార్తను తెలియజేశారు. శుభవార్త అంటే ఆమె తల్లి కాబోతుందని కాదండోయ్…

హన్సిక పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఈమె సినిమాలకు దూరం అవుతారని ఇకపై ఇండస్ట్రీకి హన్సిక దూరమవుతారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తాను సినిమాలలో నటిస్తానని హన్సిక ఈ వార్తలకు పుల్ స్టాప్ పెట్టారు.అయితే ఈమె పెళ్లి జరిగి నెల కూడా కాకుండానే ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డైరెక్టర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా హన్సిక ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైందని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా వెలబడునుంది.ఇలా పెళ్లి జరిగిన నెల రోజులకే ఈమె సినిమాలలో నటించబోతున్నానని గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన బిజినెస్ లను కూడా చూసుకోవడానికి హన్సిక సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.