వైరల్ : “గుంటూరు కారం” నుంచి అదిరిపోయిన బర్త్ డే పోస్టర్.!

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా మహేష్ కెరీర్ 28వ చిత్రం పైగా త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ బొమ్మ కూడా కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

మరి ఈసారి మహేష్ బాబు బర్త్ డే కానుకగా అయితే మేకర్స్ ఓ బ్లాస్టింగ్ పోస్టర్ ని అయితే ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమా కథని మార్చినప్పటికీ మేకర్స్ అదిరే మాస్ ఎలిమెంట్స్ తో సినిమా చేస్తున్నట్టుగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు సినిమా గ్లింప్స్ చూస్తే అర్ధం అయ్యాయి.

కాగా ఈ చిత్రం నుంచి ఇప్పుడు వచ్చిన పోస్టర్ వాటిని మించి ఉంది అని చెప్పడంలో డౌట్ లేదు. లుంగీ కట్టుకొని బీడీ కాలుస్తూ కళ్లద్దాలు పెట్టుకొని కనిపిస్తున్న మహేష్ ఊరమాస్ గా ఉన్నాడు. మరి ఇదేదో ఓ సాలిడ్ వార్నింగ్ సీన్ లా కూడా కనిపిస్తుంది.

దీనితో ఈ పోస్టర్ రిలీజ్ కాగానే సూపర్ హిట్ అయిపోయి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా మరో హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హారికా హాసిని వారు వచ్చే ఏడాది జనవరి 13న సినిమా రిలీజ్ తీసుకొస్తున్నారు.