ఇండియన్ సినిమా దగ్గర ఏ ఇండస్ట్రీ హీరో దగ్గరకి వెళ్లి అడిగినా కూడా ది బెస్ట్ సినిమా ఆడియెన్స్ ఎవరు అంటే అది తమిళ్ అవ్వని హిందీ అవ్వని ఎవరైనా కూడా తెలుగు ఆడియెన్స్ అనే అంటారు అందుకే తెలుగులో కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రమోషన్స్ చేస్తారు.
ఒకవేళ కానీ క్లిక్ అయితే ఇక నెక్స్ట్ ఆ హీరో లేదా దర్శకుని సినిమాకి ప్రమోషన్స్ కూడా అక్కరలేదు ఆ టైప్ లో తెలుగు ఆడియెన్స్ సినిమాలు చూస్తారు. ఇప్పుడు ఇదే ప్రాసెస్ తమిళ చిత్రం “లియో” కి అప్లై అయ్యింది. ఇది ఎంతలా అప్లై అయ్యింది అంటే ఈ సినిమా మత్తులో మన తెలుగు సినిమాని పట్టించుకోవడం లేదు.
తెలుగు ఆడియెన్స్ కి ఎంతో ఇష్టమైన హీరోగా అనిపించుకునే రవితేజ హీరోగా నటించిన భారీ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కూడా ఇపుడు దసరా రేస్ లో ఉండగా దీనికన్నా తెలుగు ఆడియెన్స్ ఆ ఆరవ సినిమాకే ఎక్కువ ఆసక్తి చూపడం బాధాకరం. పోనీ టైగర్ నాగేశ్వరరావు కంటెంట్ బాగోలేదా అంటే కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.
అయినా కూడా పొరుగింటి పుల్ల కూరే ఇష్టం అన్నట్టుగా తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాకి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీనితో ఇది చాలా మందికి అర్ధం కావట్లేదు. ఇన్ని రోజులు భారీ ఓపెనింగ్స్ వస్తాయి అనుకున్న ఈ చిత్రానికి లాస్ట్ మినిట్ లో డౌట్స్ రైజ్ అవుతున్నాయి. మరి టైగర్ నాగేశ్వరరావు అనుకున్న రేంజ్ హిట్ అవుతుందో లేదో చూడాలి.