నయనతార దంపతులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. ఎంక్వయిరీకి ఆదేశాలు జారీ?

ప్రస్తుతం నయనతార విగ్నేష్ దంపతులకు పిల్లలు జన్మించారంటూ చేసిన పోస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ఈ జంట వార్తల్లో నిలుస్తున్నారు.వీరి వివాహం జరిగే నాలుగు నెలలకే తల్లిదండ్రులు అయ్యామని ప్రకటించడంతో కచ్చితంగా వీరిద్దరూ సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారని స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది వీరిపై విమర్శలు చేయగా మరికొందరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం నయనతార దంపతులకు షాక్ ఇచ్చింది.

నయనతార పెళ్లయిన నాలుగు నెలలకే తల్లి అయ్యారని తెలియడంతో వీరు పెళ్లికి ముందే సరోగసి పద్ధతిని ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈమె పట్ల ఎన్నో విమర్శలు రావడంతో తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎంఏ సుబ్రమణ్యన్ నయనతార-విగ్నేష్ శివన్ లపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే హెల్త్ మినిస్టర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సరోగసి చట్టంలోనే కొన్ని లోపాలు ఉన్నాయని,ప్రాథమికంగా 21 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు వారి కుటుంబ సభ్యుల అనుమతి ప్రకారమే సరోగసి విధానంలోపిల్లలను కనే అవకాశం ఉంది అయితే ఈ చట్టం ప్రకారం నయనతార సరోగసి విధానానికి అర్హురాల కాదా అనే విషయంపై విచారణ చేపట్టనున్నారు. సరోగసి విషయంలో వీరు నిబంధనలను పాటించారా లేదా నిబంధనలను ఉల్లంఘించారా అనే విషయంపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ విచారణ చేపట్టనుందని మంత్రి వెల్లడించారు.