దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే.దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఏమాత్రం అవకాశాలు తగ్గకుండా వరుస అవకాశాలు అందుకొని ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్ గా నిలిచారు. ఇక ప్రస్తుతం ఈమె వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న విషయం తెలిసిందే.దాదాపు ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ ప్రేమలో ఉన్నటువంటి నయనతార ఈ ఏడాది జూన్ నెలలో వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా వివాహమైన నాలుగు నెలలకే ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం నయనతార పిల్లల ఆలన పాలన చూసుకుంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తున్నారు.ఇకపోతే త్వరలోనే నయనతార పుట్టినరోజు రావడంతో విగ్నేష్ భారీగా తన పుట్టినరోజు వేడుకలను చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. విగ్నేష్ పుట్టినరోజు వేడుకలను నయనతార దుబాయ్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ క్రమంలోనే నయనతార జన్మదిన వేడుకలను కూడా విగ్నేష్ భారీగా జరుపనున్నారని తెలుస్తోంది.
నయనతార నవంబర్ 18 వ తేదీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకొనుంది. అయితే ప్రతి ఏడాది విగ్నేష్ తనకు తన పుట్టినరోజును ఎంతో స్పెషల్ గా చేస్తుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం మరింత స్పెషల్ గా ఉండాలని భావించారట. ఈ ఏడాది నయనతారకు పెళ్లి అయిన తర్వాత మొదటి పుట్టిన రోజు కావడమే కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లి కావడం కూడా విశేషం అందుకే విగ్నేష్ ఈ పుట్టినరోజు తనకు ఎంతో స్పెషల్ గా ఉండాలని భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాలన్నింటిని కూడా సస్పెన్స్ లో పెట్టినట్టు సమాచారం. ఇక నయనతార పుట్టినరోజుకు తన కుమారులు ఉలగం, ఉయిర్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండనున్నారు.మరి ఈమె బర్త్డే వేడుకలు ఎలా ప్లాన్ చేసారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.