నయనతార సర్రోగసీపై ఘాటుగా కామెంట్స్ చేసిన చిన్మయి..?

Chinmayi Sripada About Ladies Hostel Warden

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా ఎంతోమందిని ఆకర్షించిన నయనతార ఇక ఇప్పుడు ఏకంగా లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది. నయనతార తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన సత్తాను చాటింది. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన నేను రౌడీనే అనే సినిమా చిత్రీకరణ సమయంలో నయనతార విగ్నేష్ ప్రేమలో పడ్డారు. ఇక అప్పటినుంచి ఏ జంట రిలేషన్షిప్ లో లేనంతగా ఉన్నారు.

ఈ ఏడాది జూన్ తొమ్మిదవ తేదీన వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్య నయనతార పేరు సోషల్ మీడియాలో మార్మోగుతుంది. నాలుగు నెలల కిందట విగ్నేష్ ని పెళ్లి చేసుకున్న ఈమె ఇద్దరు కవలపిల్లలకు తల్లి అయ్యిందని అయితే నేరుగా కాకుండా సరోగసి పద్ధతి ద్వారా నయనతార విగ్నేష్ కవలలకి జన్మనిచ్చారు.

సాధారణంగా పెళ్లి అయిన ఐదేళ్ల వరకు పిల్లలు కాకపోతే ఈ పద్ధతి ఆశ్రయించాలి. కానీ అంతకంటే ముందే దీనిని ఆశ్రయిస్తే నేరమవుతుంది. కానీ నయనతార, విగ్నేష్ మాత్రం పెళ్లి అయినా నాలుగు నెలలకే చెరువుగట్టు పద్ధతి ద్వారా కవల పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా ఈ ఇష్యూ కోర్టులో నడుస్తుంది.

ఈ తరుణంలో నయనతార గురించి రకరకాల పోస్టులు పెట్టి విమర్శలు చేస్తున్నారు. పెళ్లి అయినా నాలుగు నెలలకే పిల్లలను ఇవ్వడం ఏమిటని కొన్ని రోజులు ఆగలేకపోయారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇదే సమయంలో ప్రముఖ గాయని చిన్మయి కూడా కవలలకు జన్మనిచ్చింది. అయితే చిన్మయి కూడా సరోగసి ద్వారానే పిల్లలని జన్మనిచ్చిందని ఆమెకు సంబంధించిన ప్రెగ్నెన్సీ పోస్ట్స్ ఎప్పుడు కనిపించలేదని కొందరు సోషల్ మీడియాలో ఆమెని నయనతారతో పోల్చి పోస్ట్ పెట్టి కామెంట్ చేశారు. ఈ పోస్టులకి చిన్మయి వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది.

గతంలో క్యాస్టింగ్ కోచ్ వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీని కుదిపివేసిన సంగతి అందరికీ తెలిసిందే. చిత్రపరిశ్రమంలో కొందరు అవకాశాల పేర్లు చెప్పి కాస్టింగ్ కోచ్ కి పాల్పడుతున్నారని నటులతో పాటు కొందరు గాయని మనులు తమ గోడుని వెళ్లబోస్తున్నారు. ఈ వ్యవహారంలో ముందుగా చిన్మయి తనకు జరిగిన అన్యాయం సోషల్ మీడియా వేదికగా ఇతరులతో పంచుకోవడం జరిగింది.

ఈ సమయంలో చిన్మయినీకి కూడా కొందరు ట్రోల్స్ చేయడం జరిగింది. అప్పటినుంచి చిన్మయి ఎలాంటి కామెంట్ చేసిన వైరల్ అవుతుంది. లేటెస్ట్ గా ఈ గాయని తనపై విమర్శలకు చెక్ పెడుతూ సంచలన పోస్టులు పెట్టింది. తాను ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి ఫొటోస్ లని వీడియోస్ లని సోషల్ మీడియా కి షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది.

అయితే ఆమె ఇంతకాలం ఫ్యామిలీ పర్సనల్ విషయాలను బయటకు పెట్టకూడదని అలాగే తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేయకూడదని ఆమె భావించినట్టు తెలిపింది. షేర్ చేసినటువంటి ఫోటోలలో చిన్మయి తన కవలపిల్లలిద్దరికి పాలు తాపిస్తు ఉన్నట్టు కనీపిస్తోంది. కానీ అందరిలాగా ఆమె తప్పులు చేయనని అందులో రాసింది. అయితే ఈ మెసేజ్ నయనతార విగ్నేష్ లని ఉద్దేశించేనని కొందరు అన్నారు.

ఎందుకంటే నయనతార చిన్మయిలా మధ్య గతంలో సోషల్ వార్ కూడా నడిచింది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ పోలిక పెట్టి కొందరు పోస్టులు పెట్టడంతో అవగాహన చెంది ఇలా రిప్లై ఇచ్చిందంటు వార్తలు వస్తున్నాయి. నయనతార ఆమెకు పిల్లలు పుట్టాక ఈ ఫొటోస్ షేర్ చేయకపోయి ఉంటే ఇంత రచ్చ జరగదు కదా ఇంకా తనకు సహాయం చేసిన తన స్నేహితురాలు కూడా పడదు కదా అని చిన్మయి చెప్పుకుంటూ వచ్చింది.