బుల్లితెరపై ఒకే సీరియల్‌లో జంటగా కనిపించే వారు రియల్ లైఫ్‌లోనూ జంటగా కనిపిస్తుంటారు. కొన్నేళ్లుగా అలా సీరియల్‌తో పాటు ప్రయాణం చేస్తూ నిజంగానే ప్రేమలో పడే అవకాశాలు కూడా వస్తుంటాయి. అలా ఇప్పుడు గోరింటాకు సీరియల్ జంట విషయంలో జరిగేలా ఉంది. మధ్యాహ్నం స్టార్ మాలో వచ్చే గోరింటాకు సీరియల్ జంట రియల్ జంటగా మారబోతోన్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
గోరింటాకు సీరియల్‌లో పార్దు, కావ్యలు మంచి ఆదర్శ దంపతులుగా ఉంటారు. రౌడీ అయిన పార్దును మంచి మనిషిగా మార్చి.. ఎన్నో పరీక్షలు పెట్టి.. చివరకు పెళ్లి చేసుకుంటుంది కావ్య. ఆ సీరియల్‌లోని వీరిద్దరి కెమిస్ట్రీని చూస్తే ఎవ్వరైనా సరే వీరిది నిజమైన ప్రేమే అనుకుంటారు. అందుకే ఈ ఇద్దరిని మిగతా షోలు, ఈవెంట్లలోనూ జంటగా పిలుస్తుంటారు. అలా ఈ జంట ఇప్పుడు స్టార్ మాలో 100 పర్సెంట్ లవ్ షోలో పాల్గొంది.
ఇందులో పార్టిసిపేట్ చేసిన ఈ జంటను యాంకర్లైన రవి, వర్షిణి ఇరికించేశారు. భవిష్యత్‌లో ఒకవేళ కావ్యకు ప్రపోజ్ చేస్తారా? అని రవి అడిగాడు. చెప్పలేం.. అది సమయాన్ని బట్టి ఉంటుందని తప్పించుకున్నాడు పార్దు. ఒకేవళ ఆయన ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటారా? అని కావ్యని వర్షిణి, రవి అడిగేశారు. హా ఒప్పుకుంటానేమో అని ఎంతో నాచురల్‌గా చెప్పేసింది. ఈ లెక్క చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య వ్యహారం మొదలైనట్టు కనిపిస్తోంది.
Beautiful Reel Couples and Dynamic Real Couples madhya Love fight…Title evaridi?
‘100% Love’ today at 6 PM on @StarMaa#SundayFunday #100PercentLove pic.twitter.com/BWkXYqMOiM
— starmaa (@StarMaa) February 20, 2021