అనుష్క అభిమానులకు గుడ్ న్యూస్.. అనుష్క పెళ్లిపై క్లారిటీ..?

సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన అనుష్క శెట్టి గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ తన అందం, అభినయంతో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. ఇక అరుంధతి, భానుమతి, బాహుబలి వంటి సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయ్యింది . ఇక బాహుబలి సినిమా తర్వాత అనుష్క సినిమాలలో నటించటానికి ఎక్కువ ఆసక్తి చూపటం లేదు. ఇదిలా ఉండగా అనుష్క, ప్రభాస్ జోడీగా మూడు సినిమాలలో నటించారు. వీరిద్దరి జోడి ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చూడముచ్చటగా ఉండేది.

అందువల్ల వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని వారి అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు. అయితే తమ మధ్య కేవలం స్నేహబంధం మాత్రమే ఉందని ఇద్దరు చాలా సందర్భాలలో క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ క్రమంలో గత కొంతకాలంగా అనుష్క పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరొక్కసారి అనుష్క పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా కాలంగా సినిమాలకు, మీడియాకు దూరంగా ఉంటున్న అనుష్క ఇటీవల మంగళూరులో జరిగిన భుతకోల వేడుకల్లో పాల్గొనింది. ఈ వేడుకలకు అనుష్క తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

అయితే అనుష్క ఇలా కుటుంబసభ్యులతో కలిసి భుతకోల వేడుకల్లో పాల్గొనటం తో దానికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక గత కొన్ని రోజులుగా అనుష్క పెళ్ళి వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. అనూష హైదరాబాద్ కి చెందిన ఒక బంగారు వ్యాపారి కొడుకును వివాహం చేసుకోబోతుందని.. అందువల్లే అనుష్క కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడి ఆశీర్వాదం కోసం వేడుకల్లో పాల్గొన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. అనుష్క పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్త తెలియగానే అనుష్క ప్రభాస్ అభిమానులు మాత్రం బాధపడుతున్నారు.