స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారా.. ఇక్కడ అసలు క్లారిటీ వచ్చేసిందిగా!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు రావడం కొత్తేం కాదు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా ప్రభాస్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. అయితే ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ పెళ్లి వార్తల గురించి ప్రభాస్ సన్నిహితుల నుంచి స్పష్టత వచ్చింది.

ప్రభాస్ తో పెళ్లికి సంబంధించి వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ప్రభాస్ టీమ్ తెలిపింది. ఇలాంటి అసత్య ప్రచారాన్ని, వార్తలను నమ్మొద్దని ప్రభాస్ టీమ్ ఫ్యాన్స్ ను కోరింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బిజినెస్ మేన్ కూతురుతో ప్రభాస్ పెళ్లి జరుగుతున్నట్టు వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తల్లో నిజం లేదని మేకర్స్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.

ఏప్రిల్ నెలలో ప్రభాస్ కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రభాస్ ది రాజాసాబ్ కూడా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్ 2026 సంవత్సరంలో మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రభాస్ ఇతర భాషల్లో సైతం భారీ సక్సెస్ సాధించాలని ప్రభాస్ భవిష్యత్తు సినిమాలతో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తున్నారు. ప్రభాస్ కు తర్వాత సినిమాలు సైతం భారీ విజయాలను అందిస్తాయేమో చూడాల్సి ఉంది.