KGF 2: అమెరికాలో కేజీఎఫ్ కు కలిసిరానున్న గుడ్ ఫ్రైడే

KGF2:కన్నడ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కే జి ఎఫ్ ఎంతటి ఘన విజయంసాధించిందో అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు దేశవ్యాప్తంగా భారీగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సినిమాల జాబితాలో ఇది కూడా ఒకటి. కే జి ఎఫ్ 2 సినిమా ని ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ పనులు మాత్రం ఎక్కువగా జరగడం లేదు. మార్చి 27న సినిమాకు సంబంధించిన ట్రైలర్ మాత్రమే విడుదల చేస్తున్నట్లు సమాచారం. కానీ అభిమానులు మాత్రం ప్రమోషన్ లేకపోవడంతో కాస్త నిరుత్సాహ పడుతున్నారు. ప్రమోషన్ ఎక్కువగా లేకపోయినా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

కే జి ఎఫ్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నందున, అమెరికాలో కే జి ఎఫ్ 2 ప్రీమియర్ ఏప్రిల్ 13న అవుతుంది. ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడే కావడం ఏప్రిల్ 14న చిత్ర విడుదలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 14న చిత్రం విడుదల కాబట్టి లాంగ్ వీకెండ్ బాగా కలిసి వస్తుందని, ఇటు ఇండియాలోనూ అటు అమెరికాలోనూ లాంగ్ వీకెండ్ వలన బాక్సాఫీస్ కలెక్షన్ల కు కూడా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. సినిమా విడుదలైన తర్వాత బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకుంది అంటే లాంగ్ వీకెండ్ కావడం వలన సులువుగా అమెరికాలో 200-300k వరకు మొదటి వారం కలెక్షన్లు ఉండే అవకాశం ఉంది. సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందో లేదో వేచి చూడాలి.