గాడ్ ఫాదర్ హిట్.. భారీగా రెమ్యూనరేషన్ పెంచిన తమన్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ఎస్ఎస్ తమన్ ఒకరు. చిన్న వయసులోనే సంగీతంపై మక్కువతో ఈ రంగంలోకి వచ్చినటువంటి తమన్ సినిమా అవకాశాలను అందుకొని తన టాలెంట్ తో ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం నాలుగైదు సినిమాలను చేతిలో పెట్టుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఇదివరకు తమన్ దర్శకత్వంలో వచ్చిన వరుస చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.ఇక తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్న తమన్ తన తదుపరి సినిమాలకు భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇదివరకు ఒక్కో సినిమాకి రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుని ఈయన ఏకంగా తన రెమ్యూనరేషన్ నాలుగు కోట్లకు పెంచినట్టు సమాచారం.

ఇలా వరుస హిట్ సినిమాలతో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న తమన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈయన ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. అలాగే బోయపాటి రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు.బోయపాటి రామ్ కాంబోలో రాబోతున్న సినిమాకి ఈయన ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే తమన్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది. మరి ఈయన రెమ్యూనరేషన్ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.